హీరోయిన్లు 30 ప్లస్‌లో పడ్డాక గ్లామర్ మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు. 20-25 ఏళ్ల మధ్య కళ్లు చెదిరే అందంతో ఆకట్టుకునే హీరోయిన్లు.. ఆ తర్వాత ఉన్నట్లుండి గ్లో కోల్పోతుంటారు. షేపవుట్ అవుతుంటారు. పేర్లెందుకు కానీ.. టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోయిన్లు ఇలా ఒక వయసు దాటాక ఆకర్షణ కోల్పోయిన వాళ్లే.
ఐతే 30 ప్లస్‌లోకి వచ్చాక కూడా గ్లామర్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు కిక్కిస్తున్న హీరోయిన్లు కొద్దిమందే. అందులో కాజల్ అగర్వాల్ కచ్చితంగా ఉంటుంది. మరీ చందమామ, మగధీర సినిమాల్లో మాదిరి ఆమె మెరిసిపోతోంది అనలేం కానీ.. ఇప్పటికీ తోటి హీరోయిన్లతో పోలిస్తే పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ వావ్ అనిపిస్తూనే ఉంది. ఈ మధ్య బ్లూ కలర్ మిడ్డిలో ఆమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. అందులో కాజల్ అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. పెళ్లవుతున్న టైంలో కాజల్ కొంచెం ఆకర్షణ కోల్పోయినట్లు కనిపించింది.
ఐతే అది లాక్ డౌన్ టైం. సినిమాల్లో చేయట్లేదు. అందుకే కొంచెం మెయింటైనెన్స్ తగ్గించిందేమో. కానీ గత కొన్ని నెలల్లో మళ్లీ కాజల్ అందం పెరుగుతూ వస్తోంది. తాజాగా చందమామ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో కాజల్‌ను చూస్తే కెరీర్ తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి అభిమానులు. అంతగా ఆకర్షణతో కనిపిస్తోంది. పర్ఫెక్ట్ ఫిగర్ అంటే ఇదే అనిపించేలా ఉన్న కాజల్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతూ ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు. కాజల్ ఇదే గ్లామర్ మెయింటైన్ చేస్తే పెళ్లితో సంబంధం లేకుండా ఇంకో ఐదారేళ్లు కెరీర్‌ను లాగించేయడం గ్యారెంటీ.
This post was last modified on May 28, 2021 6:48 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…