టాలీవుడ్ సీనియర్ హీరోల్లో శరవేగంగా సినిమాలు చేసుకుపోయే వాళ్లలో విక్టరీ వెంకటేష్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆయన కొన్ని నెలల్లోనే సినిమాలు అవగొట్టేస్తుంటారు. తరచుగా రీమేక్స్ చేయడం వల్ల కూడా ఈ స్పీడు చూపించగలుగుతుంటారు వెంకీ. తాజాగా ఆయన మలయాళ చిత్రం ‘దృశ్యం-2’ రీమేక్‌ను నెలన్నర రోజుల్లో ముగించేసిన సంగతి తెలిసిందే. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తున్నాయి.
ఐతే దీని కంటే ముందు ‘నారప్ప’ పూర్తయిన నేపథ్యంలో ముందు దాన్ని రిలీజ్ చేసి, ఆ తర్వాత ‘దృశ్యం-2’ సంగతి చూడాలని నిర్మాత సురేష్ బాబు అనుకున్నాడు. మధ్యలో ‘దృశ్యం-2’ ఓటీటీలో వస్తుందన్న ప్రచారం జరగ్గా అలాంటిదేమీ లేదని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఐతే థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకుని, తర్వాత ఆలోచన మార్చుకుని ఓటీటీల్లో విడుదల చేసిన సినిమాలు లేకపోలేదు. వి, నిశ్శబ్దం లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ.
‘దృశ్యం-2’ విషయంలోనూ ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనలు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్లు ఆగస్టుకు కానీ తెరుచుకునే అవకాశం లేకపోవడం, పైగా 100 శాతం ఆక్యుపెన్సీకి ఇంకా సమయం పట్టేలా ఉండటం, ‘నారప్ప’ను రిలీజ్ చేసి గ్యాప్ ఇచ్చి ‘దృశ్యం-2’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేసరికి చాలా ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సురేష్ బాబు రెడీ అయిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ అమేజాన్ ప్రైమ్ వాళ్లతో చర్చలు కూడా జరిపారని, డీల్ కూడా ఓకే అయిందని.. త్వరలోనే దీని గురించి ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. కుదిరితే జూన్‌లోనే ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో రిలీజ్ చేయొచ్చని అంటున్నారు.
మలయాళ ‘దృశ్యం-2’ను ఫిబ్రవరిలో నేరుగా ప్రైమ్ వాళ్లే రిలీజ్ చేయడం తెలిసిందే. ఇప్పుడు అదే ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజైతే ఒకే సినిమా రెండు భాషల్లో ఒకే చోట అందుబాటులో ఉంటుందన్నమాట.
This post was last modified on May 27, 2021 8:15 am
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…