సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల అభిమానులు బయట, సామాజిక మాధ్యమాల్లో తెగ కొట్టేసుకుంటూ ఉంటారు కానీ.. నిజానికి ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చాలా సన్నిహితంగా ఉంటారు. సినిమాల పరంగా ఒకరికొకరు సాయం కూడా చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఒకరి సినిమాల్లో ఒకరు క్యామియోలు కూడా చేశారు. చివరగా సల్మాన్ నటించిన ‘ట్యూబ్ లైట్’లో షారుఖ్ క్యామియో చేస్తే.. షారుఖ్ చిత్రం ‘జీరో’లో సల్మాన్ మెరిశాడు.
ఈ ఒరవడిని కొనసాగిస్తూ షారుఖ్ కొత్త సినిమా ‘పఠాన్’లో మరోసారి తళుక్కుమనబోతున్నాడట సల్మాన్. ఐతే ఈసారి అతడి పాత్ర రంగప్రవేశం చేసే వ్యవహారమే చాలా వేరుగా ఉండబోతోందట. సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్-3’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది కొనసాగింపు చిత్రమన్న సంగతి తెలిసిందే.
‘టైగర్’ చిత్రాల ఫ్రాంఛైజీ యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లదే అన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థలోనే షారుఖ్ సినిమా ‘పఠాన్’ కూడా తెరకెక్కుతోంది. ‘వార్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న చిత్రమిది. అతను యశ్ రాజ్ ఫిలిమ్స్‌కు ఆస్థాన దర్శకుడి లాంటి వాడు. దీంతో అదే సంస్థలో తెరకెక్కుతున్న ‘టైగర్’ సినిమాలో లీడ్ రోల్‌ను తన చిత్రం కోసం వాడుకుంటున్నాడట. ఇందులో షారుఖ్ చేస్తున్నది గూఢచారి పాత్ర కాగా.. ఆ పాత్రకు రష్యన్ గన్ మాఫియా నుంచి ముప్పు ఏర్పడితే అప్పుడు టైగర్‌గా సల్మాన్ ఎంట్రీ ఇచ్చి అతణ్ని కాపాడతాడట.
ఈ క్రమంలో పెద్ద యాక్షన్ ఘట్టం ఉంటుందని.. అందులో షారుఖ్, సల్మాన్ జోడీగా విలన్ల పని పడతారని.. సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఈ ఎపిసోడ్‌ను తీర్చిదిద్దుతున్నారని.. ఈసారి షారుఖ్-సల్మాన్ జోడీ అభిమానులకు మంచి అనుభూతిని మిగల్చడం గ్యారెంటీ అని అంటున్నారు. ‘జీరో’ సహా గత కొన్నేళ్లలో షారుఖ్ నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్లే. దీంతో రెండేళ్లకు పైగా విరామం తర్వాత ఆచితూచి చేస్తున్న ‘పఠాన్’ మీద షారుఖ్ ఎన్నో ఆశలతో ఉన్నాడు.
This post was last modified on May 26, 2021 12:35 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…