హిందీ సినిమాలకు ఏడాది కిందట్నుంచి గడ్డు కాలం నడుస్తోంది. వేరే పరిశ్రమలు కొవిడ్ దెబ్బ నుంచి కొంచెం కోలుకుని థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసుకున్నాయి. మంచి విజయాలందుకున్నాయి. మంచి వసూళ్లు కూడా రాబట్టుకున్నాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం ఇలా పుంజుకోలేకపోయాయి. థియేటర్లలో సందడి తేలేకపోయాయి.
కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం థియేటర్లలో రిలీజైన హిందీ సినిమాలు చాలా వరకు చిన్నా చితకావే. వాటికి కనీస స్పందన కూడా కరవైంది. ఇక సెకండ్ వేవ్ దెబ్బకు అవి కూడా లేకపోయాయి. ఉత్తరాదిన థియేటర్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.
మళ్లీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడేలా లేకపోవడంతో చాలా కాలం నుంచి ఆపి పెట్టుకున్న భారీ చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఈ దిశగా సల్మాన్ ఖాన్ ‘రాధె’ సినిమాతో దారి చూపించింది. అది పేలవమైన సినిమా అయినప్పటికీ ఓటీటీలో మంచి ఫలితాన్నే అందుకుంది.
ఈ నేపథ్యంలో మరిన్ని పెద్ద సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘బెల్ బాటమ్’ ఈ వరుసలో రాబోతున్న మరో భారీ చిత్రం అని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారీ ధరకే హక్కులు అమ్మారట.
త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారట. గత ఏడాది అక్షయ్ సినిమా ‘లక్ష్మి’ హాట్ స్టార్‌లో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సినిమాను మించి ‘బెల్ బాటమ్’కు ఎక్కువ రేటే పలికినట్లు తెలుస్తోంది. రంజిత్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ మూవీని పూర్తిగా యూరప్‌లో చిత్రీకరించారు.
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత చిత్ర బృందమంతా యూరప్‌కు వెళ్లి ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చింది. ఈ చిత్రంలో అక్షయ్ సరసన వాణి కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా నటించారు. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ సినిమా ‘భూత్ పోలీస్’ను సైతం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
This post was last modified on May 23, 2021 12:18 pm
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…