ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాలో సెన్సేషనల్ క్యారెక్టర్లో బోల్డ్‌గా నటించి ఎక్కడలేని పాపులారిటీ సంపాదించిన పాయల్.. వెంటనే పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. కాకపోతే ఆ ఎంపికలో తప్పటడుగులు వేయడంతో పాయల్ కెరీర్ అనుకున్నుంతగా ఊపందుకోలేదు. చివరగా అనగనగా ఓ అతిథి అనే థ్రిల్లర్ సినిమాలో నటించిన పాయల్‌కు.. తెలుగులో అయితే అవకాశాలు దాదాపుగా ఆగిపోయినట్లే ఉంది. తమిళంలో ఏంజెల్ అనే సినిమాలో నటిస్తోందామె.
ఐతే మున్ముందు తన కెరీర్ ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఈ లోపే పాయల్ తన పెళ్లికి రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. తన బాయ్ ఫ్రెండ్ పేరు సౌరభ్ ధింగ్రా అని, తమ పెళ్లి కూడా నిశ్చయం అయిందని పాయల్ అనుకోకుండా వెల్లడించింది.
ఇటీవల సౌరభ్ తల్లి కరోనా కారణంగా మృతి చెందింది. దీంతో పాయల్ రాజ్‌పుత్ తీవ్రంగా కలత చెందింది. ఓ మీడియా సంస్థతో దీనిపై మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త తల్లితో తనకు గొప్ప అనుబంధం.. ఆమె చనిపోవడంతో గట్టిగా ఏడవాలనిపిస్తోందని ఆమె చెప్పింది. సౌరభ్ ఇంట్లో, తమ ఇంట్లో తమ రిలేషన్‌షిప్ గురించి తెలుసని.. అందరూ పెళ్లికి అంగీకరించారని.. ఐతే తమ పెళ్లి చూడకుండానే ఇప్పుడు సౌరభ్ తల్లి వెళ్లిపోవడం ఎంతగానో బాధిస్తోందని పాయల్ చెప్పింది.
సోషల్ మీడియాలో పాయల్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు సౌరభ్ గురించి తెలుసు. పాయల్‌తో కలిసి కొన్ని సినిమా వేడుకలతో పాటు తన చిత్రాల షూటింగ్స్‌కు కూడా అతను హాజరవుతుంటాడని అంటారు. హైదరాబాద్‌లో కొంత కాలంగా వీళ్లిద్దరూ ఒకే ఫ్లాట్‌లో కూడా ఉంటున్నట్లు సమాచారం. ఐతే ఇన్నాళ్లు అతడి గురించి బయటికి ఏమీ మాట్లాడని పాయల్.. ఈ విషాద వేళ తనకు కాబోయే భర్త అతనని, తామిద్దరంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించింది.
This post was last modified on May 20, 2021 8:26 am
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…