Movie News

రకుల్ ఆశలపై నీళ్లు

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. హీరోలు ఒకసారి స్టార్ స్టేటస్ సంపాదిస్తే.. దశాబ్దాలకు దశాబ్దాలు కథానాయకులుగా కొనసాగొచ్చు. వయసు మీద పడ్డా ఇబ్బందేమీ ఉండదు. కానీ హీరోయిన్ల సంగతలా కాదు. నిలకడగా విజయాలందుకుంటూ ఉండాలి. అలాగే గ్లామర్ కాపాడుకోవాలి. అప్పుడే స్టార్ స్టేటస్ నిలబడుతుంది. వరుసగా కొన్ని ఫ్లాపులు వచ్చినా.. కొంచెం వయసు మీద పడి గ్లామర్ తేడా కొట్టినా అంతే సంగతులు. చూస్తుండగానే కెరీర్ మసకబారిపోతుంది.

నాలుగేళ్ల కిందట తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నట్లుగా కనిపించిన రకుల్ ప్రీత్.. తర్వాత రెండేళ్లు తిరిగేసరికి టాలీవుడ్లో అడ్రస్ గల్లంతయ్యే స్థితికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అప్పట్నుంచి ఆమె స్ట్రగుల్ కొనసాగుతూనే ఉంది. తెలుగులో ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కోలీవుడ్లో సైతం ఆమెకు పెద్దగా డిమాండ్ లేదు. ఈ పరిస్థితుల్లో ఆమె ఆశలన్నీ బాలీవుడ్ మీదే నిలిచాయి.

‘దే దే ప్యార్ దే’తో ఓ మోస్తరు విజయాన్నందుకున్న రకుల్.. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ అనే పెద్ద సినిమాలో అవకాశం అందుకుంది. అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం, అదితిరావు హైదరి, నీనా గుప్తా లాంటి భారీ తారాగణంతో పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. కాశ్వి నాయర్ రూపొందించిన ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కోసమే సినిమాను రెడీ చేసినప్పటికీ.. కొవిడ్ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా విడుదల చేశారు.

ఐతే సోమవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ మొదలు కాగా.. చూసిన వాళ్లందరూ పెదవి విరుస్తున్నారు. ఉదయానికి రివ్యూలు వచ్చేయగా దాదాపుగా అన్నీ యావరేజ్, నెగెటివ్‌గానే ఉన్నాయి. కథ కొత్తగా ఉన్నప్పటికీ.. కథనం నీరసం తెప్పించేసిందని అంటున్నారు. రెండున్నర గంటల పాటు ఈ సినిమాను భరించడం కష్టమే అని అభిప్రాయపడుతున్నారు. పెర్ఫామెన్స్ పరంగా నీనా గుప్తాకు మాత్రమే ప్రశంసలు దక్కుతున్నాయి. రకుల్ పాత్ర, నటన గురించి పెద్గగా చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్లే మాట్లాడుతున్నారు. సినిమాకు నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. ఫైనల్‌గా ఈ సినిమాను ఫ్లాప్‌ అనే పేర్కొంటున్నారు. తన కెరీర్‌కు మంచి ఊపు తెస్తుందని ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ మీద రకుల్ చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఆమె ఆశలు అడియాసలైనట్లే ఉన్నాయి.

This post was last modified on May 18, 2021 6:28 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

2 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

4 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

6 hours ago