Movie News

టాలీవుడ్ సోనూ సూద్ అయిపోతున్నాడే..

కరోనా వేళ అపరిమితమైన సేవా కార్యక్రమాలతో నేషనల్ హీరోగా నిలిచాడు సోనూ సూద్. కొవిడ్ వేళ సెలబ్రెటీల్లో కొందరు తమకేమీ పట్టనట్లు ఊరుకుండిపోయారు. కొందరు విరాళాలు ప్రకటించారు. కొందరేమో తమకు వీలైనంతలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కానీ సోనూ లాగా ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకుని భారీగా ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు చేయడం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు.

దానికి కేవలం డబ్బులతో పాటు ఎంతో సమయం, ఓపిక కూడా కావాలి. సెలబ్రెటీల దగ్గర డబ్బులకు లోటుండదు కానీ.. సమయం, ఓపిక మాత్రం తక్కువే ఉంటుంది. ఈ కల్లోల సమయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోవాలని వాళ్లు అనుకోరు. అందుకే సోనూకు వస్తున్న పేరును చూసి అసూయ చెందే వాళ్లు చాలామంది అతడిలా మన వల్ల కాదని ఊరుకుంటున్నారు. ఐతే టాలీవుడ్లో ఓ యంగ్ హీరో మాత్రం తన వంతుగా ఇలాంటి ప్రయత్నమే మొదలుపెట్టి అభాగ్యులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనేే.. నిఖిల్ సిద్దార్థ.

కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనాలు అల్లాడిపోతుండటం చూసి కొన్ని రోజుల కిందట తన టీంతో రంగంలోకి దిగాడు నిఖిల్. ట్విట్టర్లో తనకు కనిపించే, తనను ట్యాగ్ చేస్తూ పెట్టే రిక్వెస్ట్‌లను చూసి వాళ్లకు ఏదో రకంగా సాయం చేయడానికి నిఖిల్ ప్రయత్నిస్తున్నాడు. కొందరికి నేరుగా తన టీం ద్వారా సాయం అందిస్తున్నాడు. ఇంకొందరికి సాయం అందే మార్గం చూపిస్తున్నాడు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యక్తులతోనూ సమన్వయం చేసుకుంటూ కొవిడ్ బాధితులను ఆదుకోవడానికి నిఖిల్ సిన్సియర్‌గానే ప్రయత్నిస్తున్నాడు. నిఖిల్ చొరవతో చాలామందికి అందాల్సిన సాయం అందుతోంది.

బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయి ప్రమాదకర స్థితికి చేరుకున్న ఓ బాధితుడికి విరాళాలు అందేలా చేయడంతో పాటు ఆరోగ్యాంధ్ర ద్వారా అతడికి వైద్య సాయం సమకూరేలా చేయడంలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడు. ఇలా మరింత మందికి సాయపడ్డాడు. సోనూ లాగా పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టి వందలు, వేల మందిని ఆదుకోవడం అందరి వల్లా కాదు కానీ.. మన వల్ల ఏమవుతుంది అనుకోకుండా కుదిరినంత మేర ఇలా సాయం చేయడానికి ప్రయత్నించడం గొప్ప విషయమే. తన ఇమేజ్ పెంచుకోవడానికి ఇలా చేసి ఉన్నా కూడా అందులో తప్పేమీ లేదు. సోనూ కూడా తాను చేస్తున్న సేవ గురించి బాగానే ప్రచారం చేసుకుంటున్నాడు. ఉద్దేశాలు ఏమైనప్పటికీ ఇలాంటి సమయంలో మనం క్షేమంగా ఉంటే చాలు అనుకోకుండా ఇలా సేవలోకి దిగడం ప్రశంసనీయం.

This post was last modified on May 17, 2021 7:19 pm

Share

Recent Posts

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

21 minutes ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

2 hours ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

3 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

3 hours ago

రవితేజకు జోడీ ఎవరు?

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…

3 hours ago

మస్క్‌కు BYD ప్రశ్న… సమాధానం ఏది?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…

3 hours ago