అంతరిక్షం నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ఇండియాలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. తెలుగులోనూ స్పేస్ నేపథ్యంలో కొన్ని సినిమాలు చూశాం. చివరగా వరుణ్ తేజ్ హీరోగా ‘అంతరిక్షం’ పేరుతో ఓ సినిమా రావడం తెలిసిందే. హాలీవుడ్, ఇతర పరిశ్రమల్లో ఇలాంటి సినిమాలకు లెక్కే లేదు. ఐతే ఈ చిత్రాలన్నీ చూస్తున్నపుడు అంతరిక్షంలో ఉన్న భావనే కలుగుతుంది. కానీ వాస్తవానికి సెట్టింగ్స్ వేసి చిత్రీకరణ జరుపుతారు. గ్రాఫిక్స్ జోడించి మనకు అంతరిక్షంలో ఉన్న భావన కలిగిస్తారు. అంతే తప్ప అంతరిక్షం నేపథ్యంలో సినిమా అంటే అంతరిక్షానికి వెళ్లడం జరగదు. అదంతా ఎంతో ఖర్చుతో, సాహసంతో కూడుకున్న పని. స్పేస్ మీదికి వెళ్లేది సైంటిస్టులు మాత్రమే. కానీ ఇప్పుడు ఓ సినిమా కోసం చిత్ర బృందం అంతరిక్షంలోకి వెళ్లబోతుండటం.. అక్కడే చిత్రీకరణ జరపనుండటం విశేషం.
‘ఛాలెంజ్’ పేరుతో త్వరలోనే ఓ రష్యన్ సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలోపే జరపనున్నారట. ఇందుకోసం చిత్ర బృందంలో అందరూ శిక్షణ కూడా పొందారట. అందరూ కలిసి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే చిత్రీకరణ జరపనున్నారట. ఈ సినిమాను క్లిమ్ షిఫెన్కో అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ త్వరలోనే అంతరిక్షంలో ఈ చిత్ర షూటింగ్ జరపనున్నామని ప్రకటించింది.
ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా చిత్ర బృందాన్ని అంతరిక్షంలోకి పంపి అప్పుడే సినిమాను లాంచ్ చేయబోతున్నారట. అప్పటి వరకు చిత్ర బృందంలోని ముఖ్యులకు ఓ స్పేస్ ఏజెన్సీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుందట. ఏడాది క్రితమే టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమాను అంతరిక్షంలో చిత్రీకరించబోతున్నట్టు నాసా పేర్కొంది. కానీ అనూహ్యంగా ఆగిపోయింది. అమెరికన్స్ వెనక్కి తగ్గిన ప్రయత్నాన్ని ఇప్పుడు రష్యన్లు నెత్తికెత్తుకోవడం విశేషం.
This post was last modified on May 17, 2021 9:09 am
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…