దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పతనం గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక సినిమా చూసి ఇంతకంటే నాసిరకం సినిమా తీయలేడు అనుకున్నపుడల్లా ఆ మాట తప్పని తన తర్వాతి సినిమాతో రుజువు చేస్తూనే ఉన్నాడు వర్మ. గత కొన్నేళ్లలో ఆయన్నుంచి ఎంత నాసిరకం సినిమాలు వచ్చాయో తెలిసిందే. ఇంతకుముందు వివాదాలతో, పబ్లిసిటీ గిమ్మిక్కులతో ఎలాగోలా సినిమాలను సేల్ చేసుకునేవాడు కానీ.. ఈ మధ్య అవి కూడా వర్కవుట్ కావడం లేదు. వర్మను అందరూ విస్మరిస్తున్నారు. ఆయన సినిమాల గురించి అసలు చర్చే ఉండట్లేదు.
వర్మ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాని పరిస్థితి. దీంతో సొంతంగా ఓటీటీలు నేరుగా సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. గత ఏడాది లాక్ డౌన్ టైంలో కొన్ని సినిమాలు ఇలాగే విడుదల చేసి కొంత సొమ్ము చేసుకున్నాడు. తర్వాత ఈ ఫార్ములా కూడా పని చేయలేదు.
కట్ చేస్తే ఇప్పుడు వర్మ ఎప్పట్నుంచో పెండింగ్‌లో పెట్టిన ‘డేంజరస్’ అనే సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నాడు. తన భాగస్వామ్యంలో మొదలైన ‘స్పార్క్’ ఓటీటీలో ముందుగా ‘డి కంపెనీ’ని రిలీజ్ చేయబోతున్న వర్మ.. ఆ తర్వాత అందులో వదలబోయే ఆణిముత్యం ‘డేంజరస్’ మూవీనే. ఇద్దరు లెస్బియన్ల మధ్య నడిచే కథ ఇది. ఈ మధ్య వర్మ ఆస్థాన కథానాయికలుగా మారిపోయిన నైనా గంగూలీ, అప్సరా రాణి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ వర్మ తాజాగా లాంచ్ చేశాడు. అది చూస్తే జుగుప్స కలగడం ఖాయం.
ఊరూ పేరూ లేని వాళ్లు బి గ్రేడ్ సినిమాలు తీసి యూట్యూబ్‌లో, పోర్న్ వెబ్ సైట్లలో వదులుతుంటారు. వాటి ప్రమాణాలకు చాలా దగ్గరగా ఉంది ‘డేంజరస్’ ట్రైలర్ చూస్తుంటే. ఒకప్పుడు హీరోయిన్ల అందాలను ఎలివేట్ చేయడంలో వర్మ ఒక అభిరుచిని చూపించేవాడు. కానీ ఇప్పుడా అభిరుచి ఏమైందో తెలియదు. మరీ ఎబ్బెట్టుగా ఉండే యాంగిల్స్‌తో, హావభావాలతో ‘చీప్’ అనే ఫీలింగ్ కలిగించాడు. అందాల ఆరబోత, ఇంటిమేట్ సీన్లు కాకుండా మిగతా విషయాల గురించి అసలు చర్చే అవసరం లేదు. ఈ ట్రైలర్ చూసి టికెట్ పెట్టి ఈ సినిమాను ఓటీటీలో ఎంతమంది చూస్తారో చూడాలి.
This post was last modified on May 14, 2021 11:32 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…