Movie News

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌పై ఎన్టీఆర్ ఇలా అన్నాడేంటి?


2020 జులై 30న రావాల్సిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ముందేమో షూటింగ్ ఆలస్యమవుతోందని ఆ డేట్ నుంచి 2021 జనవరి 8కి వాయిదా వేశారు. కానీ గత ఏడాది కరోనా వచ్చి షూటింగ్‌ ఆగిపోవడంతో ఆ డేట్‌ను మార్చక తప్పలేదు. మళ్లీ షూటింగ్ మొదలై జోరుగా పని నడిచాక చిత్ర బృందంలో కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్టోబరు 13న రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చారు.

ఈసారి బాగా ఆలోచించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే విడుదల తేదీ ప్రకటించారు. కానీ ఆ డేట్ ఇచ్చాక పరిస్థితులు మళ్లీ ఇబ్బందికరంగా తయారయ్యాయి. షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం సాగలేదు. ఆలియా కరోనా బారిన పడటం సహా వేరే కారణాలు తోడయ్యాయి. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చి పడింది. షూటింగ్ ఆపేయక తప్పలేదు. చిత్ర బృందం ప్రకటించిన విడుదల తేదీకి ఇంకో ఐదు నెలలే మిగిలున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అది అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. వివిధ భాషలకు డబ్బింగ్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో అక్టోబరు 13 అనే కాదు.. ఈ ఏడాది చివరికి కూడా ‘ఆర్ఆర్ఆర్’ రాకపోవచ్చనే అభిప్రాయంతోనే అందరూ ఉన్నారు. కానీ ఈ చిత్ర కథానాయకుల్లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడంపై ఆశావహ దృక్పథంతో ఉండటం విశేషం.

‘డెడ్ లైన్’ అనే అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ విశేషాలపై తారక్ మాట్లాడాడు. ఈ సినిమాకు సంబంధించి తమ ప్రయాణం 2018 నవంబరులో మొదలైందని.. ఐతే కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు తాము పని మానేసి ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయాన్ని మినహాయిస్తే ఇప్పటిదాకా 19 నెలల పాటు ఈ సినిమా మీద పని చేశామని తారక్ తెలిపాడు.

‘ఆర్ఆర్ఆర్’ ప్రమాణాల ప్రకారం చూస్తే ఇంత సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదని.. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ ఘట్టాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని తారక్ అన్నాడు. అక్టోబరులో ఈ సినిమాను రిలీజ్ చేయడం పట్ల తాము ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తారక్ చెప్పడం విశేషం. తారక్ మాటలు నిజమై అక్టోబరు 13నే ‘ఆర్ఆర్ఆర్’ వచ్చేట్లయితే అంతకంటే మంచి వార్త మరేముంటుంది?

This post was last modified on May 13, 2021 8:47 am

Share

Recent Posts

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

2 hours ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

3 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

3 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

8 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

10 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

12 hours ago