మలయాళ కుట్టి సాయిపల్లవి సినిమాల ఎంపికలో ఎంత సెలెక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పాత్ర, కథ నచ్చకపోతే అది ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా తిరస్కరించేస్తుంటుంది. ఇలా ఆమె వదులుకున్న పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ నుంచి కూడా సాయిపల్లవి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ సినిమాను వదులుకోవడానికి కారణం పాత్ర, కథ నచ్చక కాదు. డేట్లు సర్దుబాటు చేయలేక.
ఇదిలా ఉంటే తాజాగా సాయిపల్లవి మరో సినిమాను తిరస్కరించినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో నటించబోయే తొలి చిత్రం అయిన ‘ఛత్రపతి’ రీమేక్‌కు సాయిపల్లవి నో చెప్పిందట. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిని ఎంచుకోవాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు.
కానీ శ్రీనివాస్ సరసన నటించడానికి కియారా అద్వానీ సహా కొందరు హీరోయిన్లు నో అనేశారు. భారీ పారితోషకం వారిని టెంప్ట్ చేయలేకపోయింది. ఐతే అక్కడ ప్రయత్నించి విఫలమయ్యాక సాయిపల్లవిని ఈ సినిమా కోసం అడిగితే ఆమె కుడా నో అనేసిందంటూ వార్తలు వస్తున్నాయి.
ఐతే ‘ఛత్రపతి’లో శ్రియ చేసిన హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అది ఫక్తు కమర్షియల్ సినిమాల్లో కనిపించే గ్లామర్ డాల్ పాత్ర. అలాంటి పాత్రను సాయిపల్లవి ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చేయలేదు. ఆమె చేసే అవకాశం కూడా లేదు. అసలే విషయం లేని పాత్ర. పైగా రీమేక్. అది కూడా చాలా పాత సినిమా. అందులోనూ తీస్తున్నది హిందీలో. అందులోనేమో శ్రీనివాస్ హీరో. ఇలాంటి సినిమాను సాయిపల్లవి ఎలా ఒప్పుకుంటుందసలు? సినిమా రేంజ్ గురించి కాకుండా పాత్ర గురించే ఆలోచించే ఆమెను ఇలాంటి సినిమాకు అడిగారంటేనే ఆశ్చర్యపోవాలి.
This post was last modified on May 12, 2021 5:56 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…