Movie News

ఎమ్మెస్ రాజుకు లైసెన్స్.. ఇక రెచ్చిపోవడమే

సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజుకు ఒకప్పుడు ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉండేదో తెలిసిందే. శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దానా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఆయన నిర్మించారు. దేవిపుత్రుడు, పౌర్ణమి లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. ఈ సినిమాలు నిర్మించడంలో రాజు అభిరుచి, ఆయన సాహసం ప్రశంసలు అందుకున్నాయి. కానీ ఒక దశ దాటాక చాలామంది నిర్మాతల్లాగే ఆయన కూడా తడబడ్డారు.

ముఖ్యంగా ఆయన దర్శకుడిగా మారాక మరింతగా వైఫల్యాలు ఎదుర్కొన్నారు. చివరికి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇక ఆయన కథ ముగిసినట్లే అనుకుంటుండగా.. ‘డర్టీ హరి’ అనే అడల్ట్ రేటెడ్ సినిమా తీసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు రాజు. ఈ చిత్రాన్ని గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ చేసి మంచి ఫలితం అందుకున్నారు.

ఫుల్ ఎరోటిక్ సీన్లతో నిండిన ఈ సినిమా యువ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నిజానికి ఇందులో కొత్త కథేమీ కనిపించదు. కథనం కూడా అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ ఇందులోని బోల్డ్ సీన్లే కుర్రకారును బాగా ఆకట్టుకున్నాయి. పెట్టుబడి మీద మంచి లాభాలనే తెచ్చిపెట్టింది రాజుకు ఈ సినిమా. ‘డర్టీ హరి’ తీయడానికి రాజు దగ్గర డబ్బుల్లేకపోతే వేరే నిర్మాత పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. కానీ ఆ సినిమా ద్వారా వచ్చిన లాభాల్లో వాటాతో ఇప్పుడు స్వీయ నిర్మాణంలో ఇంకో సినిమా తీయడానికి రెడీ అయిపోయాడు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ నిర్మాణంలో రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’ అనే సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

రాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడించారు. టైటిల్‌కు తోడు మరో యూత్ ఫుల్ బోల్డ్ మూవీ అనడం ద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. ‘డర్టీ హరి’ ఆన్ లైన్లో మంచి ఆదరణ పొందడంతో రాజు ఈసారి మరింత బోల్డ్ సినిమా తీయడానికి లైసెన్స్ వచ్చినట్లే. తనకు ముందున్న ఇమేజ్ గురించి ఆయన ఎంతమాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈసారి మరింత రెచ్చిపోయి మరింతగా ఎరోటిక్ సీన్లతో సినిమాను నింపేస్తారేమో.

This post was last modified on May 10, 2021 9:51 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

43 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

1 hour ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago