ఏడాది నుంచి ఇండియాలో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలదే హవా. ఓవైపు సినిమాలతో, మరోవైపు వెబ్ సిరీస్‌లతో, ఇంకోవైపు టాక్ షోలతో హోరెత్తించేస్తున్నాడు ఓటీటీలు. ఇంతకముందు సెలబ్రెటీల టాక్ షోలంటే టీవీ ఛానెళ్లలోనే చూసేవాళ్లం. కానీ ఓటీటీలు కూడా వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎక్స్‌క్లూజివ్‌గా తమ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తెలుగు వారి ఓటీటీ ఆహా మంచి దూకుడు మీద ఉంది. వైవా హర్ష, సమంత, రానా హోస్ట్‌లుగా ఈ సంస్థ టాక్ షోలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఓటీటీల్లో ఒకటైన.. ఇండియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న అమేజాన్ ప్రైమ్ కూడా ఈ బాటలోనే నడవబోతోంది. నేషనల్ లెవెల్లో ఈ సంస్థ ఒక పెద్ద టాక్ షోను నడిపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక స్పెషల్ హోస్ట్‌ను రెడీ చేసినట్లు సమాచారం. ఆ హోస్ట్ ఎవరో కాదు.. ఇలియానా.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా మంచి స్థాయిని అందుకుని దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఇలియానా హోస్ట్‌గా అమేజాన్ ప్రైమ్ ఒక టాక్ షోను సిద్ధం చేస్తోందట. ఇందుకోసం ఇలియానాకు భారీ మొత్తంలో పారితోషకం కూడా ఇస్తున్నారట. వివిధ భాషలకు చెందిన సెలబ్రెటీలను ఇలియానా ఇంటర్వ్యూలు చేయనుందట. ప్రైమ్‌లో ఎన్నో వెబ్ సిరీస్ ఒరిజినల్స్ చూశాం కానీ.. దాన్నుంచి ఇలాంటి టాక్ షో లాంటిది రాలేదు.
ఇలియానా లాంటి ఫేమస్ హీరోయిన్.. నటీనటులను ఇంటర్వ్యూ చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుందని భావిస్తున్నారు. ఇలియానా కూడా ఈ షో పట్ల చాలా ఎగ్జైటెడ్‌గానే ఉందట. ఈ మధ్యనే హాట్ స్టార్‌లో ప్రసారమైన ‘బిగ్ బుల్’తో ప్రేక్షకులను పలకరించిన ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ టాక్ షోను హోస్ట్ చేసే ఛాన్స్ రావడంతో సంతోషంగా ఒప్పుకున్నట్లుంది.
This post was last modified on May 7, 2021 3:41 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…