టాలీవుడ్లో రీమేక్‌లతో భారీ విజయాలందుకున్న స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకడు. చంటి, అబ్బాయిగారు, రాజా, సూర్యవంశం, దృశ్యం, గురు లాంటి సూపర్ హిట్ రీమేక్ సినిమాలున్నాయి వెంకీ కెరీర్లో. త్వరలో ఆయన్నుంచి రానున్న నారప్ప, దృశ్యం-2 చిత్రాలు సైతం రీమేక్‌లే అన్న సంగతి తెలిసిందే. ఈ రెంటి తర్వాత వెంకీ మరో రీమేక్‌లో నటించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్‌లో వెంకీ నటించనున్నాడట.
ఈ సినిమా తెలుగు రీమేక్ చర్చలు ఇప్పటివి కావు. మలయాళంలో ఈ సినిమా విడుదలై విజయం సాధించిన కొన్ని నెలలకే ఓ నిర్మాత తెలుగు రీమేక్ హక్కులు కొన్నాడు. పవన్ కళ్యాణ్ అని.. రవితేజ అని.. ఇందులో నటించే హీరోల పేర్లు చాలానే వినిపించాయి. చివరికి ఇప్పుడు ఈ రీమేక్ వెంకీ దగ్గర ఆగిందట. ఆయన ఈ చిత్రాన్ని దాదాపు ఓకే చేసినట్లే అంటున్నారు.
ఒక సూపర్ స్టార్ హీరో, అతడి వీరాభిమాని మధ్య వివాదం నేపథ్యంలో నడిచే ఆసక్తికర సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’. మోటార్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా చేయదలుచుకున్న స్టార్ హీరో.. తన డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరించుకునేందుకు ఆర్టీవో ఆఫీసుకి వస్తాడు. అక్కడ తన వీరాభిమాని అయిన మోటార్ వెహికల్ ఆఫీసర్‌ను అనుకోకుండా అవమానిస్తాడు. దీంతో అతను హీరోకు ఎదురు తిరిగి డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు.
ఆ తర్వాత ఎత్తులు పైఎత్తులతో ఈ సినిమా సాగుతుంది. గత ఏడాది హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన ‘అయ్యప్పనుం కోషీయుం’ దర్శకుడు సాచీ ఈ సినిమాకు స్క్రిప్టు అందించడం విశేషం. మలయాళంలో పృథ్వీరాజ్ స్టార్ హీరో పాత్రలో కనిపిస్తే.. సూరజ్ అభిమాని పాత్రలో నటించాడు. తెలుగులో వెంకీ ఈ సినిమా చేసేట్లయితే స్టార్ హీరో పాత్రలోనే కనిపించే అవకాశముంది. మరి అభిమాని క్యారెక్టర్ చేసేదెవరో చూడాలి.
This post was last modified on May 5, 2021 7:02 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…