సూపర్ స్టార్ రజినీకాంత్ కొంచెం గ్యాప్ తర్వాత ఇటీవల మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో అన్నాత్తె కోసం భారీ సన్నివేశాల చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ ఆలోచనను కూడా విరమించుకున్న సూపర్ స్టార్.. మధ్యలో వదిలేసిన ‘అన్నాత్తె’ చిత్రీకరణను మాత్రం కరోనా కష్ట కాలంలోనూ రిస్క్ చేసి మరీ పూర్తి చేయడానికి నడుం బిగించారు.
రామోజీ ఫిలిం సిటీలో రజినీ మీద భారీ యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో చాలామందే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఆయన అమెరికాకు బయల్దేరుతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఆయనకు మళ్లీ ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తాయా అన్న ఆందోళన అభిమానుల్లో మొదలైంది. గత ఏడాది కూడా ఆయన అమెరికాకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
రజినీ ఆరోగ్యంగానే ఉన్నారని.. రెగ్యులర్ చెకప్‌ల కోసమే అమెరికాకు వెళ్లారని అంటున్నారు. మరి కొన్ని రోజుల తర్వాత యుఎస్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు పెడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రజినీ కొంచెం ముందుగానే యుఎస్ చేరుకుంటున్నట్లు తెలిసింది. మూణ్నాలుగు వారాల పాటు అక్కడే ఉండి పరీక్షలు చేయించుకుని.. అంతా ఓకే అనుకున్నాక ఇండియాకు వస్తారట.
తనకున్న ఆరోగ్య సమస్యలకు తోడు.. కరోనా భయం కూడా ఉండటంతో రజినీ తన వెంటే ఓ వైద్య బృందాన్ని పెట్టుకుంటున్నారు. ఆయన షూటింగ్‌కు వెళ్లినపుడు కూడా వెంట ఆ బృందం ఉంటోంది. ఈ ఏడాది దీపావళికి ‘అన్నాత్తె’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే సంకల్పంతో రజినీ కష్టపడుతున్నారు. ఈ సినిమా పూర్తి చేశాక ఆయన పూర్తిగా విశ్రాంతికి పరిమితం కానున్నారు. కరోనా భయం పూర్తిగా తొలగిపోతే కానీ కొత్త సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు.
This post was last modified on May 5, 2021 6:58 pm
కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన…
ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…
తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే హవా చూపించాయి.…
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…