దక్షిణాదిన ట్రెండును ఫాలో కావడం కాకుండా ట్రెండ్ సృష్టించడానికి ప్రయత్నించే కథానాయికల్లో సమంత ఒకరు. వెబ్ సిరీస్‌లను ఇక్కడి సౌత్ హీరోయిన్లు కొంచెం తక్కువగా చూస్తున్న సమయంలో భవిష్యత్తు వాటిదే అని గుర్తించి రెండేళ్ల ముందే ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సెకండ్ సీజన్లో నటించడానికి ముందుకొచ్చిందామె. అందులో సమంతది నెగెటివ్ రోల్ కావడం విశేషం.
‘ఫ్యామిలీ మ్యాన్’ తొలి సీజన్ విశేషమైన ఆదరణ సంపాదించుకున్న నేపథ్యంలో రెండో సీజన్ కోసం ఏడాది కిందట్నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ కరోనా కారణంగా అది చిత్రీకరణ పూర్తి చేసుకోవడంలో ఆలస్యం జరిగింది. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. టీజర్ సైతం వదిలారు. కానీ అమేజాన్ ప్రైమ్ నిర్మించి ‘తాండవ్’ సిరీస్ వివాదంలో చిక్కుకోవడం, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అనుకోకుండా ఈ సిరీస్ విడుదలకు బ్రేక్ పడింది.
చూస్తుండగానే నెలలు గడిచిపోతున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సంగతేంటో తేలట్లేదు. థియేటర్లలో సినిమాలు లేక, ఓటీటీల్లో కొత్త కంటెంట్ లేక ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి టైంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రిలీజైతే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి ఈ సిరీస్‌ను రిలీజ్ చేయడంలో ఏం ఇబ్బందులు ఉన్నాయన్నది అర్థం కావడం లేదు. ఫిబ్రవరిలోనే ప్రిమియర్స్‌కు సన్నాహాలు చేశారు కాబట్టి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులేమీ పెండింగ్‌లో లేనట్లే. ఫస్ట్ కాపీ రెడీ అయినట్లే. ఇక వివాదాస్పద సన్నివేశాలు తీసేసి రీఎడిట్ చేసే పని ఏమైనా ఉందనుకున్నా.. అది కూడా ఈపాటికి పూర్తయ్యే ఉండాలి.
ఈ సిరీస్ మరీ ఇంత ఆలస్యం ప్రేక్షకులు ఏమాత్రం రుచించడం లేదు. లేటైతే అయ్యింది కానీ.. కనీసం ఫలానా టైంలో సిరీస్‌ను రిలీజ్ చేస్తాం అనే సంకేతాలు కూడా చిత్ర బృందం ఇవ్వడం లేదు. సమంతను టెర్రరిస్టుగా సంచలన పాత్రలో చూడ్డానికి ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు కానీ.. మరీ ఇలా జాప్యం చేస్తే ఆసక్తి సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను సాధ్యమైనంత త్వరగా బయటికి తెస్తే బెటర్.
This post was last modified on May 4, 2021 7:15 am
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…