Movie News

మెగా కుర్రాడి కోసం ఎంతమంది బాబోయ్

‘ఉప్పెన’ సినిమాతో సంచలన అరంగేట్రం చేశాడు మెగా ఫ్యామిలీ కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’కు సంబంధించి కొన్ని ప్రోమోలు చూస్తేనే అతడిలో మంచి విషయం ఉందని ఫిలిం మేకర్స్ గుర్తించారు. ఈ సినిమా విడుదలకు ముందే అతను క్రిష్ లాంటి అగ్ర దర్శకుడితో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడో ఆ సినిమా షూటింగ్ అయిపోయింది.

ఇంతలో ‘ఉప్పెన’ విడుదల కావడం, భారీ విజయాన్నందుకోవడం, వైష్ణవ్ పెర్ఫామెన్స్‌కు ప్రశంసలు దక్కడం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్లో అతను హాట్ షాట్ హీరో అయిపోయాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ దర్శకుడు గిరీశయ్యతో వైష్ణవ్ తన మూడో సినిమాను నెల కిందటే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మెగా కుర్రాడి కోసం మరింతమంది దర్శకులు, నిర్మాతలు లైన్లో ఉండటం విశేషం.

అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో వైష్ణవ్ సినిమా చేయబోతున్న సంగతి ఇంతకుముందు వెల్లడైంది. ఇక ప్రణవ్ అనే సుకుమార్ అసిస్టెంట్ ఒకరు.. వైష్ణవ్ తేజ్‌తో సినిమా కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు. వైష్ణవ్ డేట్లు సంపాదించిన ఓ నిర్మాత.. ఈ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి కథ సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో మంచి విజయాలందుకున్న వెంకీ కుడుముల సైతం వైష్ణవ్‌తో ఓ సినిమా కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్నది తాజా సమాచారం.

‘భీష్మ’ తర్వాత ఎవరైనా పెద్ద హీరోతో సినిమా చేద్దామని చూశాడతను. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. కాగా ఇప్పుడు వైష్ణవ్‌తో ఒక మంచి ఎంటర్టైనర్ చేయాలని చూస్తున్నాడట. కథ కూడా రెడీ అయిందని.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి, వైష్ణవ్‌కు స్క్రిప్టు వినిపించారని.. త్వరలోనే ఈ కలయికలో సినిమా మొదలయ్యే అవకాశముందని అంటున్నారు. మొత్తానికి ఒక సినిమా రిలీజ్‌తో వైష్ణవ్ ఇంత బిజీ అయిపోవడం, అతడి కోసం ఇంత మంది లైన్లో ఉండటం విశేషమే.

This post was last modified on May 4, 2021 7:13 am

Share

Recent Posts

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

25 minutes ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

33 minutes ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

1 hour ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

3 hours ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

4 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

4 hours ago