గత ఏడాది వేసవిలో మాదిరే.. ఈసారి కూడా సినిమాల వాయిదాల పర్వాన్ని చూస్తున్నాం. ఏప్రిల్లో రావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడిపోయాయి. మే అంతటా కూడా పరిస్థితులు మారేలా లేవు. ఈ నెలలో కూడా కొత్త సినిమాల విడుదల అనమానంగానే ఉంది. ‘ఆచార్య’ సహా ఈ నెలకు షెడ్యూల్ అయిన సినిమాలను వాయిదా వేసేశారు. మళ్లీ ఎప్పుడు థియేటర్లు మునుపటిలాగా నడుస్తాయో.. పెండింగ్ పడ్డ సినిమాల్లో ఏది ఎఫ్పుడు విడుదలవుతుందో తెలియని అయోమయం నెలకొంది.
రాబోయే నెలలకు షెడ్యూల్ అయిన సినిమాలు కూడా డేట్లు మార్చుకోక తప్పేలా లేదు. ఐతే ఏ సినిమా ఎటు మారినా.. ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ విడుదలలో మాత్రం మార్పు ఉండదంటూ ఆ చిత్ర వర్గాల నుంచి సమాచారం వస్తుండటం విశేషం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఆ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 30న విడుదల చేయాలని ప్రభాస్ అండ్ టీమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
‘రాధేశ్యామ్’కు సంబంధించి ఇంకో పది రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. గత కొన్ని నెలల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. పరిస్థితులు మరీ దుర్భరంగా తయారైతే తప్ప మిగతా చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి జులై 30కి సినిమాను రిలీజ్ చేయడం కష్టం కాకపోవచ్చు.
ఐతే సౌత్ సినిమా మార్కెట్ జూన్ నెలకు పూర్వపు స్థితికి చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. కానీ గత ఏడాది నుంచి ఉత్తరాది మార్కెట్ ఏ స్థితిలోనూ పుంజుకోలేదు. దాని మీదే అనుమానాలున్నాయి. అందుకే సల్మాన్ ఖాన్ తన ‘రాధె’ చిత్రాన్ని ఓటీటీ బాట పట్టించాడు. ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ఈ నెల 13న ‘జీ’ ఫ్లాట్ ఫామ్‌లో, డీటీహెచ్‌ల్లో రిలీజ్ చేస్తున్నాడు. అలాగే దాన్ని థియేటర్లలోనూ విడుదల చేయబోతున్నాడు.
ఉత్తరాదిన థియేటర్ల మార్కెట్ మరీ నామమాత్రంగా ఉన్న సమయంలోనే సల్మాన్ ఇలా ధైర్యం చేసి సినిమాను రిలీజ్ చేసేస్తున్నాడు. థియేటర్ల మీద పెద్దగా ఆశల్లేకపోవడంతో పేరుకు థియేట్రికల్ రిలీజ్ అన్నట్లే కానీ.. దీన్ని ఓటీటీ రిలీజ్‌గానే భావించాలి. ఇదే బాటలో రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద చిత్రాలు నడుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఉత్తరాది మార్కెట్ ఈ ఏడాదంతా కూడా పుంజుకుంటుందన్న ఆశల్లేని నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ను సైతం ఇలా ఒకేసారి థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ చేస్తే.. ఎవరు ఎలా చూడాలనుకుంటే అలా చూస్తారని.. ముఖ్యంగా సౌత్ వాళ్లు థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను ఆదరిస్తే.. ఉత్తరాది వాళ్లు ఓటీటీలో చూస్తారని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే ఏ నిర్ణయమైనా రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టే తీసుకునే అవకాశముంది.
This post was last modified on %s = human-readable time difference 2:38 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…