ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న భామ ఎవరూ అంటే రష్మిక మందన అని చెప్తారు. తన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’లో మరింత క్యూట్‌గా కనిపించి అలరించింది. హీరో కార్తీతో కలిసి ‘సుల్తాన్’ సినిమాతో తమిళ తంబీలను ఆకట్టుకుంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’లో నటిస్తోంది. ఇంత బిజీగా ఉన్న ఆమె తను చేసిన సినిమాల్లో ఏది ఎక్కువగా ఇష్టం అంటే ఏం సమాధానం చెప్తుంది. అందరిలా నాకు అన్ని ఇష్టమని తప్పించుకుంటుందా…అంటే అలా చెప్పలేదు. క్లారిటీగా తనకు ఇష్టమైన సినిమా పేరు చెప్పేసింది.
ఆ సినిమా మరేదో కాదు…ఇక తనకి ఎన్ని సినిమాలు సూపర్ హిట్ రేంజ్ ఇచ్చినా తాను కన్నడలో నటించిన ఫస్ట్ సినిమా కిర్రాక్ పార్టీనే తన ఫెవెరెట్ మూవీగా చెప్తోంది రష్మిక. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అలాగే తెలుగులో ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగులు వేశారు. ‘గీతా గోవిందం’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక గతేడాది రెండు భారీ హిట్లు కొట్టిన రష్మిక మందన దక్షిణాదిన బిజీ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలకు ఓకే చెప్పింది కూడా. ఇదిలా ఉండగానే.. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా తర్వాతి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ‘ఆకాశమే నీ హద్దురా’లో తన మార్కు నటన చూపించి విమర్శల ప్రశంసలు సైతం అందుకున్నాడు సూర్య. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే.. మరో సినిమాకు ఓకే చెప్పేశాడు. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం సూర్యకు 40వ సినిమా. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అలాగే ఈ అమ్మడు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అయితే రీసెంట్ గా మరో బాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పింది.
This post was last modified on May 1, 2021 8:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…