సూర్య తమ్ముడు అనే ట్యాగ్‌ను తన తొలి సినిమా ‘పరుత్తి వీరన్’ విడుదల కావడానికి ముందు మాత్రమే ఉపయోగించుకున్నాడు కార్తి. ఆ సినిమా రిలీజ్ కావడం ఆలస్యం.. కార్తికి సొంత గుర్తింపు వచ్చింది. అతడే స్థాయే మారిపోయింది. తొలి సినిమాలోనే అద్భుత నటన కనబరచడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కార్తి వెనుదిరిగి చూసుకోలేదు. కార్తి అరంగేట్రం చేసేసరికి సూర్య పెద్ద స్టార్ కాగా.. కొన్నేళ్లలోనే అన్నను మించి భారీ చిత్రాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు కార్తి.
యుగానికి ఒక్కడు, కాష్మోరా, ఖాకి లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఇటీవలే విడుదలైన ‘సుల్తాన్’ సైతం భారీ చిత్రమే. అతడి మీద రూ.40-50 కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటే, భారీ కథలను దర్శకులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కార్తి మరో మెగా మూవీకి శ్రీకారం చుట్టాడు. ఇది అతడి కెరీర్లో మరో భారీ చిత్రం అయ్యేలా ఉంది.
సర్దార్.. ఇదీ కార్తి కొత్త సినిమా పేరు. ఇరుంబు తిరై/అభిమన్యుడు సినిమాతో అరంగేట్రంలోనే అదరగొట్టిన మిత్రన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ రోజే టైటిల్, ఫస్ట్‌లుక్‌తో కూడిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూస్తే సినిమా రేంజే వేరుగా ఉండబోతోందని అర్థమవుతోంది. మోషన్ పోస్టర్లో భాగంగా మ్యాప్‌లో చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలను చూపించడం విశేషం. భారీగా జుట్టు, గడ్డంతో కార్తి లుక్ సైతం చాలా కొత్తగా ఉంది.
ఇప్పటిదాకా లోకల్ కథలే చేసిన కార్తి.. ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్లబోతున్నట్లు మోసణ్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మోషన్ పోస్టర్‌ను ఎలివేట్ చేశాడు. ‘అభిమన్యుడు’ తర్వాత మిత్రన్ తీసిన రెండో సినిమా ‘హీరో’ సైతం హిట్టయింది. దీంతో కార్తి హీరోగా అతను చేయబోయే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on April 26, 2021 8:12 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…