సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది నిధి అగర్వాల్. ప్రారంభంలో నిధి అగర్వాల్ తో విజయం దోబూచులాడింది. పూరి దర్శకత్వంలో, రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ హాట్ బ్యూటీ దశ తిరిగింది.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి అగర్వాల్ తన ఒంపుసొంపులతో కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ అమ్మడు క్రేజీగా మారిపోయింది. సామజిక మాధ్యమాల్లో చిన్న పిక్ షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఇక తన సోయగాలు ప్రదర్శించేలా ఆ పిక్స్ ఉంటే.. ఇంటర్నెట్ లో తుఫానే.
తాజాగా మరోసారి అదే జరిగింది. నిధి అగర్వాల్ క్లివేజ్ అందాలు ప్రదర్శించేలా ఉన్న ఫోటోషూట్ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భారీ ప్రాజెక్టు హరిహర వీరమల్లులో కూడా నటిస్తోంది. పవన్ చిత్రం నిధి అగర్వాల్ కు ప్రతిష్టాత్మకం కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే నిధి మరో మెట్టు ఎక్కేసినట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates