బాహుబలికి ముందు ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్. ఆ సమయానికి ప్రభాస్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అదే. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవడం విశేషం. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. అతడి సినిమాల స్థాయే వేరు. కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్ గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడట్లేదు. పదో వార్షికోత్సవం సందర్భంగా దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు.
హీరో సహా మెయిన్ కాస్ట్ అండ్ క్రూలో ఎవరూ ఈ సినిమాను గుర్తు చేసుకున్నట్లు కనిపించలేదు. కానీ అందులో ఓ చిన్న పాత్ర చేసిన నటుడు మాత్రం ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆ చిన్న పాత్రతో మొదలైన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుని పొంగిపోయాడు. అతనెవరో కాదు.. యువ కథానాయకుడు సత్యదేవ్.
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో, చిన్న అవకాశం వస్తే చాలనుకున్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి పెద్ద సినిమాలో ప్రభాస్ ఫ్రెండుగా నటించే అవకాశం రావడంతో సత్యదేవ్ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆ సమయానికి ఎవరూ అతణ్ని గుర్తు పెట్టుకోలేదు. ఆ పాత్ర గురించి మాట్లాడుకోలేదు. తర్వాత ఇలాంటి చిన్న పాత్రలు మరి కొన్ని చేశాడు. కొన్నేళ్లకు పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మికి జోడీగా కీలక పాత్ర ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని తన సత్తా ఏంటో చూపించాడు సత్యదేవ్.
గత కొన్నేళ్లలో సత్యదేవ్ సినిమాల్లో ఏవి ఎలా ఆడాయన్నది పక్కన పెడితే.. ప్రతి పాత్రతోనూ నటుడిగా అతను తన ప్రతిభను చాటుకున్నాడు. గత ఏడాది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో నటుడిగా మరిన్ని మెట్లు ఎక్కాడు. ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, తిమ్మరసు లాంటి ఆసక్తికర సినిమాల్లో నటిస్తున్నాడు సత్యదేవ్. తాను నటుడిగా అరంగేట్రం చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ విడుదలై పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ సినిమాలోని ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు తన ప్రయాణానికి తోడ్పడ్డ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఒక భావోద్వేగ పోస్టు పెట్టాడు సత్యదేవ్.
This post was last modified on April 24, 2021 9:55 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…