Movie News

ఒక్క పెద్ద ఛాన్స్.. ఎంత మార్చేసిందో


కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసినా.. వాటితో మంచి ఫలితాలు అందుకుంటే ఆటోమేటిగ్గా పెద్ద సినిమాలు చేసే అవకాశం వస్తుంది. స్టార్ హీరోలు పిలిచి అవకాశం ఇస్తారు. ఇలాంటి అవకాశాలు చాలామంది జీవితాలను మార్చేస్తుంటాయి. ఒక్కసారిగా రేంజ్ మారిపోతుంటుంది. అందుకే ఇలాంటి ‘ఒక్క ఛాన్స్’ కోసం చాలామంది యువ దర్శకులు ఎదురు చూస్తుంటారు.

‘అహనా పెళ్లంట’ అనే కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి మంచి విజయాన్నందుకుని.. ఆ తర్వాత ‘పూల రంగడు’ చిత్రంతో మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న వీరభద్రం చౌదరి కూడా అప్పట్లో ఓ పెద్ద అవకాశం కోసం ఎదురు చూశాడు. కొత్త, వర్ధమాన దర్శకులను బాగా ప్రోత్సహించే అక్కినేని నాగార్జున అతడికి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. హీరోగా నటిస్తూ సొంత బేనర్లో సినిమాను నిర్మించాడు. ఆ చిత్రమే.. భాయ్.

మూడో సినిమాకే నాగార్జున లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందని వీరభద్రం ఎంత మురిసిపోయాడో? కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాన్నందుకుంది. దెబ్బకు వీరభద్రం ఆకాశం నుంచి నేల మీద పడ్డాడు. స్వయంగా నాగార్జున ఈ సినిమా గురించి రిలీజ్ తర్వాత ప్రతికూల వ్యాఖ్యలు చేయడం, తనను ఇష్టపడేవాళ్లు ఈ సినిమా చూడొద్దని ఓ సందర్భంలో అనడం వీరభద్రం కెరీర్‌కు బాగానే డ్యామేజ్ చేసింది. అతడికి తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఆదితో ‘చుట్టాలబ్బాయి’ అనే సినిమా చేస్తే అదంత మంచి ఫలితాన్నివ్వలేదు. మళ్లీ ఇంకో అవకాశం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు వీరభద్రం.

మధ్యలో రాజశేఖర్‌తో ఓ సినిమా ఓకే అయినట్లే అయి క్యాన్సిల్ అయింది. ఇంకే పేరున్న హీరో కూడా అతడితో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఆదితో ఓ సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. కానీ ఆది పరిస్థితేంటో తెలిసిందే. అతను విజయానికి ముఖం వాచిపోయి ఉన్నాడు. మార్కెట్ జీరో అయిపోయింది. ఇలాంటి హీరోతో వీరభద్రం లాంటి దర్శకుడు ఈ దశలో ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి. మొత్తానికి ‘భాయ్’ అనే సినిమా తన కెరీర్‌ను ఈ స్థాయికి తీసుకొస్తుందని వీరభద్రం ఊహించి ఉండడు.

This post was last modified on April 20, 2021 5:38 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

13 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago