అనుకున్నదే అయింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో ప్రేక్షకుల పరిమితిని 50 శాతానికి తగ్గించేశారు. కేవలం ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తే సరిపోదు. థియేటర్లలో ప్రేక్షకులు ఎలా పడితే అలా కూర్చోవడానికి వీల్లేదు. ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీ ఉంచాల్సిందే. ఈ విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాల నుంచి థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు అందాయి.
గత రెండు మూడు వారాల్లో దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి అమాంతం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు. ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక అవ్వగానే థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడంతో పాటు అనేక షరతులు పెడతారన్న సంకేతాలు కొన్ని రోజుల ముందు నుంచే వస్తున్నాయి. ఇప్పుడు లాంఛనంగా ఆ నిర్ణయాన్ని అమల్లో పెట్టారు. మరోవైపు ఏపీలో విద్యా సంస్థలన్నింటినీ మూసి వేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే పాఠశాలలన్నింటినీ మూసి వేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో సైతం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అవ్వగానే థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడంతో పాటు మరిన్ని షరతులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై కొన్ని రోజుల ముందే సంకేతాలు రావడంతోనే వకీల్ సాబ్ తర్వాత షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలను వాయిదా వేయడం మొదలైంది. ఏపీలో టికెట్ల ధరలపై నియంత్రణ నేపథ్యంలో చాలా చోట్ల థియేటర్లను ఇప్పటికే స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. ఇక ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం, పేరున్న సినిమాలు లేకపోవడంతో మరిన్ని థియేటర్లు మూత పడటం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 20, 2021 9:01 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…