‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏది? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కొన్ని రోజుల ముందు వరకు అయితే కొరటాల శివతో సినిమానే చేస్తాడని అనుకున్నారంతా. కానీ ‘ఆచార్య’ తర్వాత కొరటాల అనూహ్యంగా ఎన్టీఆర్ సినిమాను లైన్లో పెట్టాడు. దీంతో బన్నీ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది. ఇంకో రెండు మూడు నెలల్లో ‘పుష్ప’ పూర్తి చేసి ఖాళీ అవబోతున్న బన్నీ.. తర్వాత ఏ సినిమా చేస్తాడనే అయోమయం అందరిలోనూ కొనసాగుతోంది.
అతను కలిసి పని చేయాలనుకుంటున్న ఏ స్టార్ ధర్శకుడూ ఆ సమయానికి ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అతను ఎప్పట్నుంచో పెండింగ్‌లో పెట్టిన ‘ఐకాన్’ ఏమైనా పట్టాలెక్కుతుందా అని చూస్తున్నారు అభిమానులు. ఈ చిత్రానికి స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయిపోయింది. దర్శకుడు, నిర్మాత సిద్ధంగా ఉన్నారు. కానీ బన్నీనే ఎటూ తేల్చట్లేదు.
బన్నీకి ‘ఐకాన్’ నచ్చిన కథ అని.. ఏదో ఒక టైంలో వీలు చేసుకుని ఈ సినిమా చేస్తానని దర్శకుడు వేణు శ్రీరామ్‌కు బన్నీ చెప్పాడని గతంలో అతడి మిత్రుడు బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక తాజాగా ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో వేణును అడిగితే ఆ సినిమా ఎఫ్పుడు మొదలవుతుందో తనకు తెలియదనేశాడు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో దిల్ రాజు ఏమో.. తమ తర్వాతి సినిమా ‘ఐకాన్’యే అంటూ ప్రకటించాడు. కానీ బన్నీ మాత్రం ఈ సినిమాను వెంటనే మొదలుపెట్టే మూడ్‌లో లేడన్నది అతడి సన్నిహితుల మాట.
ఒక టైంలో ఈ చిత్రం చేయడానికి మాట ఇచ్చినప్పటికీ.. ఆ సినిమా చేయడం కరెక్టా కాదా అనే సందిగ్ధంలో అతను పడ్డాడని.. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అసాధారణ విజయం అందుకున్నాక అతడి ఆలోచన తీరు మారిపోయిందని, ఆషామాషీ సినిమాలు చేయొద్దని, బాగా పేరున్న దర్శకులతోనే పని చేయాలనే ధోరణిలోకి వెళ్లిపోయాడని.. అందుకే ‘ఐకాన్’ సంగతి ఎటూ తేల్చట్లేదని అంటున్నారు. ‘పుష్ప’ తర్వాత తాను కోరుకున్న స్థాయిలో ఏ ప్రాజెక్టు సెట్ కాకపోతే అప్పుడు ‘ఐకాన్’ గురించి ఆలోచిస్తాడని.. తుది నిర్ణయం మాత్రం ఇప్పుడే తీసుకోడని అతడి సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
This post was last modified on April 19, 2021 6:51 am
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…