నెల రోజుల ముందు కరోనా గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. మళ్లీ కేసులు పెరుగుతున్నాయి అన్నా కూడా ఎవరిలోనూ పెద్దగా భయం కనిపించలేదు. గత ఏడాది ఇదే సమయానికి కొవిడ్ భయంతో వణికిపోయిన జనాలు.. ఆరు నెలలు గడిచాక వైరస్‌ను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ షరతులన్నీ పక్కకు పోయాయి. అన్ని కార్యకలాపాలూ యధావిధిగా నడవడం మొదలయ్యాయి. కరోనా కేసులు కూడా రోజు రోజుకూ తగ్గుతూ వెళ్లడంతో ఇక గండం గట్టెక్కినట్లే అనుకున్నారు. ఒక దశ దాటాక కరోనా గురించి చర్చే లేకపోయింది.
తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా కరోనా ప్రభావం నుంచి బయటపడి మునుపటి స్థాయిలో నడవడం మొదలైంది. షూటింగ్స్ జోరుగా సాగాయి. థియేటర్లలో సినిమాలు 100 శాతం ఆక్యుపెన్సీతో నడవడం మొదలయ్యాయి. ఇక ఇండస్ట్రీకి ఏ బాధా లేదనే అనుకున్నారంతా.
కానీ గత నెల రోజుల వ్యవధిలో మొత్తం కథ మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి ఊహించని స్థాయికి చేరింది. కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. గత ఏడాది పీక్ స్టేజ్ అనుకున్న దాన్ని మించిపోయి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. ఇక ఎప్పటికీ గత ఏడాది చూసిన కష్ట కాలం రాదనుకుంటే.. మళ్లీ అవే పరిస్థితులు దాదాపు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ పెట్టకపోవచ్చు కానీ.. జనాలు జాగ్రత్త పడకుంటే, స్వీయ నియంత్రణ పాటించకుంటే దారుణాలు చూడక తప్పేట్లు లేదు.
ఈ నేపథ్యంలో త్వరలోనే థియేటర్లపై మళ్లీ ఆంక్షలు తప్పవంటున్నారు. షూటింగ్స్ సజావుగా సాగడమూ కష్టంగానే ఉంది. ప్రభుత్వం ఆదేశించడానికి ముందే పరిశ్రమ పెద్దలు దీని గురించి అంతర్గతంగా చర్చించి షూటింగ్స్ ఆపేయాలని చూస్తున్నారట. ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల షూటింగ్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇలా ఎవరికి వారు షూటింగ్స్ ఆపడం కష్టమని.. కాబట్టి ఇండస్ట్రీ తరఫున ఓ నిర్ణయం తీసుకుని, షూటింగ్స్ ఆపించేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ మేరకు నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు.
This post was last modified on April 17, 2021 1:44 pm
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో…
అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…