లాక్ డౌన్ టైంలో వేరే దారి లేక ఆకాశం నీ హద్దురా, వి, నిశ్శబ్దం లాంటి పేరున్న సినిమాలకు సైతం థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో అది అనివార్యం. ఐతే లాక్ డౌన్ బ్రేక్ తర్వాత దాదాపుగా అన్ని సినిమాలూ నేరుగా పెద్ద తెర మీదే విడులవుతున్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ రిలీజ్‌కు మధ్య అంతరం బాగా తగ్గిపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
సంక్రాంతికి రిలీజైన విజయ్ సినిమా ‘మాస్టర్’ను రెండు వారాలు తిరక్కుండానే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడంపై ఎగ్జిబిటర్లు గగ్గోలు పెట్టడం తెలిసిన సంగతే. అంత పెద్ద సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఇక థియేటర్ల వైపు జనం ఎలా వస్తారన్న ప్రశ్న వారి నుంచి వ్యక్తమైంది. థియేటర్లలో బాగా ఆడుతుండగానే ఓటీటీకి సినిమాను ఇచ్చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ స్థాయి పెద్ద సినిమాలు కాదు కానీ.. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఇలాగే తక్కువ వ్యవధిలో ఓటీటీల్లోకి వచ్చాయి.
ఇప్పుడు మళ్లీ ఓ పెద్ద సినిమా చాలా తక్కువ గ్యాప్‌లో ఓటీటీలోకి వచ్చేస్తుండటం మళ్లీ పెద్ద చర్చకు తావిచ్చింది. కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్‌కుమార్ సినిమా గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పునీత్ సినిమా రేంజ్ ఏంటో కన్నడిగులకు బాగా తెలుసు. అంత పెద్ద హీరో సినిమాను థియేటర్లలో రిలీజైన వారానికే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తుండటం కన్నడ పరిశ్రమలో చిన్నపాటి కుదుపుకే కారణమైంది.
ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమలో కూడా ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను చేజేతులా చంపేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘యువరత్న’ కన్నడలో మంచి టాకే తెచ్చుకుంది. ఈ చిత్రానికి తొలి వారం భారీ వసూళ్లే వచ్చాయి. ఐతే రెండో వారం ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించేయడం, తెలుగు చిత్రం ‘వకీల్ సాబ్’ ఎఫెక్ట్ గట్టిగా పడేలా ఉండటంతో ఓటీటీ రిలీజ్‌కు వెళ్లిపోయినట్లున్నారు. ఐతే ‘యువరత్న’ నిర్మాతలు వాళ్ల స్వార్థం వాళ్లు చూసుకున్నా.. ఈ నిర్ణయం ఇండస్ట్రీకి మంచిది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
This post was last modified on April 9, 2021 5:31 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…