అక్కినేని నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. వైల్డ్ డాగ్. ఆఫీసర్, మన్మథుడు-2 లాంటి పెద్ద డిజాస్టర్ల తర్వాత తన కెరీర్‌ను మళ్లీ గాడిన పెడుతుందని ఆ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు నాగ్. నిజానికి ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ చేసేందుకు ఎప్పుడో ఒప్పందం కూడా కుదిరింది.
ఐతే సినిమా చాలా బాగా వచ్చిందన్న ధీమాతో ఆ డీల్ క్యాన్సిల్ చేసి మరీ థియేటర్లలోకి వదిలారు. విడుదల ముంగిట బాగా ప్రమోషన్ కూడా చేశారు. నాగ్ అండ్ టీం కోరుకున్నట్లు వైల్డ్ డాగ్‌కు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ ఏం లాభం? ఆ టాక్ వసూళ్ల రూపంలోకి మారలేదు. నాగ్ లాంటి స్టార్ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు వెళ్లలేదు. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
వైల్డ్ డాగ్ విడుదలైన శుక్రవారం రోజు సెలవు. శని, ఆదివారాలు ఎలాగూ వారాంతమే. అయినా సరే.. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా షేర్ రూ.3 కోట్ల మార్కును కూడా టచ్ చేయలేకపోయింది. ఇప్పటిదాకా షేర్ రూ.3.5 కోట్లకు అటు ఇటుగా ఉందంతే. వీకెండ్లోనే ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన వైల్డ్ డాగ్.. సోమవారం నుంచి నామమాత్రంగా నడుస్తోంది. శుక్రవారం వకీల్ సాబ్ వచ్చాక ఈ చిత్రం థియేటర్ల నుంచి లేచిపోవడం ఖాయం. ఈలోపు వచ్చే రెండు రోజుల్లో కూడా ఈ సినిమా పెద్దగా షేర్ రాబడుతుందన్న ఆశల్లేవు.
మెగాస్టార్ చిరంజీవి వచ్చి సినిమాను ప్రమోట్ చేసినా అది పెద్దగా కలిసి రాలేదు. ఫుల్ రన్ షేర్ రూ.4 కోట్లు కూడా దాటేలా లేదు. ఈ చిత్రానికి నాగ్ కెరీర్లోనే అతి తక్కువగా రూ.7 కోట్ల మేర బిజినెస్ అయిందంతే. పాజిటివ్ టాక్ వస్తే రికవరీ పెద్ద కష్టం కాదనుకున్నారు. కానీ చివరికి చూస్తే రూ.3 కోట్ల నష్టం తప్పట్లేదు. అంటే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా సినిమా డిజాస్టర్‌గానే నిలవబోతోందన్నమాట.
This post was last modified on April 7, 2021 11:09 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…