గత రెండు దశాబ్దాల్లో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎక్కువగా రీమేక్‌ల్లో నటించింది ఎవరు అంటే మరో మాట లేకుండా సల్మాన్ ఖాన్ పేరు చెప్పేయొచ్చు. ఒక దశలో బాగా దెబ్బ తిన్న ఆయన కెరీర్ మళ్లీ గాడిన పడింది పోకిరి రీమేక్ వాంటెడ్‌తోనే అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సల్మాన్.. రెడీ, కిక్, బాడీ గార్డ్, జైహో లాంటి రీమేక్ సినిమాల్లో నటించాడు. కొంచెం గ్యాప్ తర్వాత సల్లూ భాయ్ మరో సౌత్ రీమేక్‌లో నటించబోతున్నాడన్నది తాజా సమాచారం.
ఈ సంక్రాంతికి తమిళ, తెలుగు భాషల్లో విడుదలై భారీగా వసూళ్లు రాబట్టిన విజయ్ సినిమా మాస్టర్‌ను హిందీలో సల్మాన్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ చిత్రం హిందీలోకి వెళ్లబోతున్న విషయం ఇంతకముందే ఖరారైంది. హీరో ఎవరన్న దాని మీదే సస్పెన్స్ నడుస్తోంది.
ఐతే మాస్టర్ హిందీ రీమేక్ హక్కులు దక్కించుకున్న మురాద్ ఖేతాని, ఎండెమోల్ షైన్‌లు సల్మాన్‌తో నెల రోజులుగా ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. సల్మాన్‌కు బేసిక్ లైన్ నచ్చిందని, సినిమా చేయడానికి సుముఖత వ్యక్తం చేశాడని.. ఐతే ఉన్నదున్నట్లు సినిమా తీస్తే హిందీలో వర్కవుట్ కాదని.. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేయాలని సల్మాన్ సూచించాడట. పూర్తి స్క్రిప్టుతో వస్తే ఈ సినిమా చేసే విషయమై నిర్ణయం తీసుకుంటానని సల్మాన్ చెప్పినట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఈ సినిమాను ఓకే చేస్తే.. విజయ్ సేతుపతి పాత్రకు కూడా ఓ పెద్ద హీరోనే తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా ఏమీ ఖరారవ్వలేదు. సల్మాన్ కొత్త చిత్రం రాధె విడుదలకు సిద్ధంగా ఉండగా.. అంతిమ్ అనే మరో సినిమాలో నటిస్తున్నాడతను.
This post was last modified on April 4, 2021 10:39 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…