‘శివ’ సినిమాతో అక్కినేని నాగార్జున కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఐతే అప్పుడు నాగార్జునకు అతను ఎంతగా ఉపయోగపడ్డాడో.. ఆ తర్వాత అంతకుమించిన నష్టం చేశాడు. కొన్నేళ్ల కిందట వర్మతో కలిసి ‘ఆఫీసర్’ అనే సినిమా చేసి బాక్సాఫీస్ దగ్గర నాగ్ ఎదుర్కొన్న పరాభవం అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా చేయడానికి రెండేళ్ల ముందు నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’తో ఏకంగా రూ.50 కోట్ల షేర్ సాధించాడు.
అలాంటిది ‘ఆఫీసర్’ ఫుల్ రన్ షేర్ రూ.కోటి మాత్రమే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దర్శకుడిగా వర్మ పూర్తిగా పతనం అయిపోయిన దశలో నాగ్ అతణ్ని నమ్మడం చారిత్రక తప్పిదమనే చెప్పాలి. దర్శకుడిగా, అలాగే వ్యక్తిగతంగా వర్మ చుట్టూ ఉన్న నెగెటివిటీ మొత్తం ఈ సినిమాకు అంటుకుంది. సినిమాకు దారుణ పరాభవం ఎదురైంది.
ఈ దెబ్బ నుంచి నాగ్ ఇప్పటికీ కోలుకోలేపోతుండటం గమనార్హం. ‘ఆఫీసర్’ తర్వాత నాగ్ నుంచి వచ్చిన ‘దేవదాస్’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఆ తర్వాత ‘మన్మథుడు-2’కు నెగెటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది. ఒకప్పుడు నాగ్ చిత్రాలు ఫ్లాప్ అయినా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునేవి. కానీ ‘మన్మథుడు-2’కు అదీ కరవైంది. నాని ఉండటం వల్లో ఏమో ‘దేవదాస్’ పరిస్థితి కొంచెం మెరుగు.
ఇప్పుడిక ‘వైల్డ్ డాగ్’ విషయానికి వస్తే.. దీని ట్రైలర్ బాగున్నప్పటికీ సినిమాకు ఆశించిన బజ్ రాలేదు. రిలీజ్ ముందు రోజు బుకింగ్స్ చూస్తే నాగ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తినేసిందో అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఒక్కటంటే ఒక్క షో ఫుల్ కాలేదు. ప్రైమ్ సెంటర్లలో ప్రముఖ థియేటర్లు బుకింగ్స్ లేక వెలవెలబోతున్నాయి. ఇదంతా ఆఫీసర్ తాలూకు ప్రభావం అనడంలో సందేహం లేదు. అప్పుడు దెబ్బ తిన్న మార్కెట్ ఆ తర్వాత పెద్దగా పుంజుకోలేదు. పైగా ‘ఆఫీసర్’ తరహాలోనే ‘వైల్డ్ డాగ్’లోనూ నాగ్ స్పెషల్ ఆఫీసర్ పాత్ర చేస్తుండటం కూడా ప్రేక్షకుల్లో అనాసక్తి కొంచెం కారణం కావచ్చు.
This post was last modified on April 2, 2021 9:26 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…