కోలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు సీనియర్ నటుడు రాధా రవి. ఆయన ఏదైనా వేదిక ఎక్కితే ఏం మాట్లాడతారో అర్థం కాదు. తనపై తనకు నియంత్రణ ఉండదు. అవతలి వాళ్ల మనోభావాల గురించి ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది అనేస్తుంటారు. ముఖ్యంగా మహిళలంటే ఆయనకు చిన్నచూపు అనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. కొన్ని సినిమా వేదికల మీద దారుణమైన వ్యాఖ్యలు చేసి బుక్కయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తిని రాజకీయ పార్టీలు నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో ఆయన డీఎంకే పార్టీలో ఉండగా.. ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ నయనతార మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. దీంతో డీఎంకే పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం రాధారవి అన్నాడీఎంకే-భాజపా కూటమికి మద్దతుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఆయన నయనతారను టార్గెట్ చేసుకున్నారే. సంబంధం లేకుండా ఆమె పేరును తీసుకొచ్చి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను డీఎంకే నుంచి తప్పించడం గురించి రాధారవి మాట్లాడుతూ.. ఆ పార్టీకి నయనతార ఏమవుతుందని ప్రశ్నించారు. ఆమె ఆ పార్టీకి పీఆర్వోనా అని అడిగారు.
గతంలో నయనతార గురించి మాట్లాడినందుకు డీఎంకే పార్టీ నుంచి తనను తప్పించాలని చూశారని.. కానీ వాళ్లు ఆదేశాలు పంపేలోపే తాను ఆ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేశానని చెప్పిన రాధారవి.. నయన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ఒకవేళ ఆమె కనుక ఉదయనిధి స్టాలిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను?’’ అంటూ అనుచిత వ్యాఖ్య చేశారు. సదరు వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రాధారవి మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలుండగా.. అధికార పార్టీకి రాధారవి వ్యాఖ్యలు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాయి.
This post was last modified on April 2, 2021 6:52 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…