ఫూల్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో రకరకాల ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఐతే తెలుగు సినీ అభిమానులు మాత్రం దర్శకుల ప్రసంగాల తాలూకు వీడియోలు, ఫొటోలు, మీమ్స్ పెట్టి ఫూల్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు. మన ఇండస్ట్రీలో టాప్ స్టార్లు చేసిన కొన్ని సినిమాలు అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం చవిచూశాయి.
ఐతే ఆయా సినిమాల ఆడియో, ప్రి రిలీజ్ ఈవెంట్లలో మాత్రం వాటి దర్శకులు తమ చిత్రాల గురించి ఓ రేంజిలో చెప్పుకున్నారు. అభిమానులకు ఎక్కడ లేని భరోసా ఇచ్చారు. వారిలో ఉత్కంఠ పెంచారు. అప్పటికే ఉన్న అంచనాలను వీరి మాటలు మరింత పెంచేశాయి. వీళ్ల మాటలు నమ్మి థియేటర్లకు వెళ్తే అక్కడ కనిపించిన బొమ్మ వేరు. ఒక్కసారిగా ఆశలన్నీ కూలిపోయాయి.
ఈ నేపథ్యంలో మన స్టార్ డైరెక్టర్ల ఒకప్పటి స్పీచ్‌ల తాలూకు స్క్రీన్ షాట్లు పెట్టి వ్యంగ్యంగా హ్యాపీ ఫూల్స్ డే అని హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. వాళ్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను లాంటి దర్శకులనే. ‘అజ్ఞాతవాసి’ సినిమాతో పవన్ అభిమానులకు త్రివిక్రమ్ ఎంత వేదన కలిగించాడో తెలిసిందే. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పవన్ నట విశ్వరూపం చూస్తారని, సినిమా గొప్పగా ఉంటుందని అన్నాడు. కానీ తీరా చూస్తే ఆ సినిమాలో పవన్ నటన పేలవంగా కనిపించింది. సినిమా గురించైతే చెప్పాల్సిన పని లేదు.
ఇక ‘వినయ విధేయ రామ’ సినిమా గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అభిమానులు గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడొచ్చన్నాడు. ఇక ‘స్పైడర్’ గురించి మురుగదాస్ చెబుతూ.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది, లేదంటే నా తల తీసి మీ పాదాల దగ్గర పెడతా అనేశాడు మహేష్ అభిమానులతో. ఇక ‘రెబల్’ గురించి రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. మామూలు సినిమా తీస్తే ప్రభాస్ అభిమానులు ఒప్పుకోరని, వాళ్లకు హిట్ కాకుండా బ్లాక్‌బస్టర్ ఇవ్వబోతున్నానని అన్నాడు. మరోవైపు ‘శక్తి’ గురించి మెహర్ రమేష్.. ‘బ్రహ్మోత్సవం’ గురించి నటుడు నరేష్ ఇచ్చిన బిల్డప్పులను కూడా అభిమానులు గుర్తు చేస్తూ ఫూల్స్ డేను సెలబ్రేట్ చేస్తుండటం విశేషం
This post was last modified on April 2, 2021 6:39 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…