మణిశర్మ కొడుకు సంగీత దర్శకుడిగా మారుతున్నాడంటే ముందు చాలామంది లైట్ తీసుకున్నారు. నటుడి కొడుకు నటుడిగా మారి రాణించిన ఉదాహరణలు కోకొల్లలు కానీ.. అంత ఆషామాషీగా అబ్బని సంగీత ప్రతిభతో మ్యూజిక్ డైరెక్టర్ల వారసులు రాణించిన దాఖలాలు చాలా తక్కువ. అసలు సంగీత దర్శకులు తమ వారసుల్ని ఈ రంగంలోకి తీసుకురావడమే అరుదు.
తమిళంలో ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా.. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ మాత్రమే ఘన వారసత్వాకి తగ్గ పనితనం చూపించారు. తెలుగులో మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ తండ్రిని అనుసరిస్తూ సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసినపుడు అతడి మీద ఎవరికీ పెద్దగా నమ్మకాలు కనిపించలేదు. ‘ఛలో’ ముందు వరకు అతను తన ప్రత్యేకతను చూపించలేకపోయాడు. ఆ సినిమాతో అతడి ప్రతిభ అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత ‘భీష్మ’తో మరోసారి మెరుపులు మెరిపించాడు సాగర్. ఈ రెండు సినిమాల్లోనూ వీనుల విందైన పాటలతో ఆకట్టుకున్నాడతను. ఐతే నేపథ్య సంగీతం విషయంలో అతను మరింత మెరుగవ్వాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే మణిశర్మకు ఆర్ఆర్ కింగ్‌గా పేరుంది. ఈ విషయంలో తండ్రిని చేరుకోవడానికి సాగర్ చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, ఆయనలా నేపథ్య సంగీతంలో తనదైన ముద్ర వేస్తే కానీ.. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లు కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఐతే తాజాగా రిలీజైన నితిన్ మూవీ ‘మాస్ట్రో’ ఫస్ట్ గ్లింప్స్ చూశాక సాగర్ మామూలోడు కాదు అనే మాట సినీ విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎలాంటి మూడ్ క్రియేట్ చేయాలో బాగా అర్థం చేసుకున్న సాగర్.. డిఫరెంట్ సౌండ్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు. థ్రిల్లర్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోరే ప్రాణం. హిందీలో ‘అంధాదున్’కు ఆర్ఆర్ పెద్ద ప్లస్ అయింది. తెలుగులో సాగర్ తన ప్రత్యేకతను చూపించేలాగే ఉన్నాడు. ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు పెంచిన సాగర్.. సినిమాలోనూ ఇదే ఔట్ పుట్ ఇస్తే అతడి పేరు మార్మోగడం ఖాయం.
This post was last modified on March 31, 2021 8:10 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…