సంక్రాంతి సమయంలో క్రాక్.. ఫిబ్రవరిలో ఉప్పెన.. మార్చిలో జాతిరత్నాలు.. బాక్సాఫీస్‌ను ఎలా రూల్ చేశాయో తెలిసిందే. ఈ సినిమాలకు పోటీగా వేరే చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఐతే ఎక్కువ పాజిటివ్ టాక్ వీటికే వచ్చింది. పోటీలో ఉన్న మిగతా చిత్రాలను ఇవి తొక్కి పడేశాయి. రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్‌ను రూల్ చేశాయి. తర్వాతి వారాల్లో వచ్చిన సినిమాలను కూడా వెనక్కి నెట్టాయి.
ఈ మూడు చిత్రాల సరసన చేరుతుందని అంచనా వేసిన సినిమా ‘రంగ్ దే’. గత వారాంతంలో మూడు చిత్రాలు విడుదల కాగా.. అన్నింట్లోకి మంచి టాక్ తెచ్చుకున్నది ‘రంగ్ దే’నే. పైన చెప్పుకున్న సినిమాల్లాగే ఇది వీకెండ్లో వచ్చిన మిగతా సినిమాలను తొక్కేసింది. బాక్సాఫీస్‌ను రూల్ చేసింది. సోమవారం హోలి సెలవు కూడా కలిసి రావడంతో ‘రంగ్ దే’ రూ.12.5 కోట్ల మేర వరల్డ్ వైడ్ షేర్ రాబట్టగలిగింది.
ఐతే వీకెండ్ వరకు మంచి వసూళ్లు రాబట్టింది కానీ.. ‘రంగ్ దే’ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో జోరు చూపించట్లేదు. మంగళవారం వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు తరహాలో ఇది రిలీజైన తర్వాతి వారాల్లోనూ ఆధిపత్యం చలాయించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. పై సినిమాల స్థాయిలో ఈ చిత్రంలో ప్రేక్షకులను గట్టిగా ఆకర్షించే అంశాలు తక్కువే. ‘
క్రాక్’ మాస్ ప్రేక్షకులకు విందు కాగా.. ‘ఉప్పెన’ మంచి ఫీల్ ఉన్న, హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ కావడంతో యువత బాగా ఆకర్షితులయ్యారు. ‘జాతిరత్నాలు’ హిలేరియస్ మూవీ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్లకు పరుగులు పెట్టారు. ‘రంగ్ దే’ యావరేజ్‌గా అనిపించే టైంపాస్ మూవీ కావడంతో వీకెండ్ తర్వాత హోల్డ్ చేయడం కష్టమయ్యేలా ఉంది. పైగా ఈ వారం ‘వైల్డ్ డాగ్’, ‘సుల్తాన్’ మంచి అంచనాలతో రిలీజవుతున్నాయి. తర్వాతి వారం ‘వకీల్ సాబ్’ ఉంది. కాబట్టి ‘రంగ్ దే’కు లాంగ్ రన్ డౌటే. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.20 కోట్లకు పైగానే షేర్ రాబట్టాల్సిన ఈ చిత్రం ‘హిట్’ స్టేటస్ అందుకుంటుందా అన్నదీ సందేహమే.
This post was last modified on March 31, 2021 7:54 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…