కరోన-లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు ఎలా అల్లాడిపోయాయో తెలిసిందే. ఈ దెబ్బ నుంచి బాలీవుడ్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. మిగతా ఇండస్ట్రీలు కూడా నత్తనడకనే నడుస్తున్నాయి. కానీ తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఈ దెబ్బ నుంచి త్వరగానే తేరుకుంది. ఈ విరామం తర్వాత థియేటర్లు పునఃప్రారంభం అయిన కొన్ని రోజులకే అవి కళకళలాడాయి.
50 శాతం ఆక్యుపెన్సీతోనే మన సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగాక పరిస్థితి మరింత మెరుగుపడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా టాలీవుడ్ మళ్లీ కళకళలాడుతోంది. ఇది చూసి మిగతా ఇండస్ట్రీల వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. మన ఇండస్ట్రీని, ప్రేక్షకులను పొగిడేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో కార్తి సైతం తెలుగు సినీ పరిశ్రమ, ఇక్కడి ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించాడు.
తన కొత్త చిత్రం సుల్తాన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన కార్తి.. దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలకూ ఒక హోప్ ఇచ్చిన ఇండస్ట్రీ టాలీవుడ్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తెలుగు సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయని.. అది చూసి తమిళ ఇండస్ట్రీ కూడా ఎంతో సంతోషించిందని కార్తి తెలిపాడు. తన సినిమా రిలీజ్ చేయాలనుకున్నపుడు కూడా.. తెలుగులో మంచి సినిమాలను ఆదరిస్తున్నారన్న ధీమాతో విడుదలకు సిద్ధమైనట్లు చెప్పాడు కార్తి.
ఇక ఊపిరి సినిమాలో తనతో కలిసి నటించిన నాగార్జునతో ఇప్పుడు బాక్పాఫీస్ పోటీకి దిగడంపై కార్తి మాట్లాడుతూ.. దురదృష్ట వశాత్తూ, మరో అవకాశం లేక వైల్డ్ డాగ్‌కు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయాల్సి వస్తోందన్నాడు. నాగార్జున తన సొంత కుటుంబ సభ్యుడిలాగే అని, ఆయన్ని సోదరుడిగా భావిస్తానని.. వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పెద్ద మనసుతో ఆయన తన సినిమా కూడా బాగా ఆడాలని కోరుకున్నాడని.. ఇందుకు ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెబుతానని.. వైల్డ్ డాగ్ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నానని కార్తి అన్నాడు.
This post was last modified on March 31, 2021 7:40 am
న్యాచురల్ స్టార్ నాని జెర్సీతో తెలుగులో పేరు సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కు తర్వాత అవకాశాలు పెద్ద మోతాదులో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పారంటే... దానికి అనుగుణంగానే ముందుకు సాగుతూ ఉంటారు.…
థియేటర్లో వచ్చినప్పుడు ఎల్2 ఎంపురాన్ కు జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. వివాదాలు చుట్టుముట్టాయి. కేంద్ర అధికార పార్టీని…
పెహల్ గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా ఉగ్ర…
అధికారం చెల్లిది.. ప్రజలు గెలిపించింది కూడా ఆమెనే. కానీ.. పెత్తనం మాత్రం అన్నదమ్ములు చేసేస్తున్నారు. ఈ వ్యవహారం.. టీడీపీలో తీవ్ర…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా…