Movie News

ఇద్దరు మిత్రుల సమరం.. గెలిచేదెవ‌రో?

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. బయట మంచి మిత్రులైన నితిన్, రానా దగ్గుబాటి బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారు. నితిన్ కొత్త సినిమా ‘రంగ్ దె’, రానా ఏడాది కిందటే పూర్తి చేసి పక్కన పెట్టిన ‘అరణ్య’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టాలీవుడ్ వేసవి వినోదానికి ఈ సినిమాలే శ్రీకారం చుడుతున్నాయి. మున్ముందు వేసవిలో భారీ చిత్రాలు రాబోతున్న నేపథ్యంలో వీటితో శుభారంభం దక్కుతుందని టాలీవుడ్ ఆశిస్తోంది. ప్రతి వారం విడుదలయ్యే అన్ని సినిమాలూ బాగా ఆడాలనే అందరూ కోరుకుంటారు.

కానీ కరోనా బ్రేక్ తర్వాత ఏ వారం కూడా రెండు సినిమాలు బాగా ఆడిన దాఖలాలు లేవు. ఒకటి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మిగతా సినిమాలను దెబ్బ కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలో రంగ్ దె, అరణ్య సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో.. దేన్ని ఏది దెబ్బ కొడుతుందో చూడాలి. రెండూ బాగా ఆడితే అందరికీ సంతోషమే.

ప్రి రిలీజ్ బజ్ ప్రకారం చూస్తే ‘రంగ్ దె’దే స్పష్టమైన పైచేయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైనర్లంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ‘రంగ్ దె’కు మంచి హైపే వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ‘అరణ్య’ సీరియస్ సినిమా కావడంతో పెద్దగా హడావుడి కనిపించడం లేదు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ చాలా చాలా అవసరం. ‘రంగ్ దె’కు ఓ మోస్తరు టాక్ వచ్చినా బాక్సాఫీస్ జర్నీ తేలికైపోతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

ఈ రెంటితో పాటు ఈ వీకెండ్లో మరో ఆసక్తికర చిత్రం విడుదల కాబోతోంది. ‘మత్తు వదలరా’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో అరంగేట్రం చేసిన కీరవాణి చిన్న కొడుకు సింహా నటించిన రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’ పై రెండు చిత్రాలతో డైరెక్ట్ క్లాష్ లేకుండా శనివారం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రోమోలు ఆకట్టుకున్నాయి. మంచి ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించాయి. మరి గట్టి పోటీ మధ్య ఈ చిన్న సినిమా ఏమేర బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపుతుందో చూడాలి.

This post was last modified on March 26, 2021 11:46 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

4 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

4 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

4 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

7 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

7 hours ago