నటీనటులు, టెక్నీషియన్లకే కాదు.. తెరమీద కనిపించే కార్టూన్ క్యారెక్టర్లకు, జంతువులకు కూడా అభిమానులంటారు. కుంగ్‌ఫూ పండా, కింగ్ కాంగ్ లాంటి పాత్రలను అమితంగా ఇష్టపడే అభిమానులు కోకొల్లలు. ఐతే ఈ పాత్రల్ని పెట్టి తీసిన సినిమాలు వస్తే థియేటర్లకు వెళ్లి చూడ్డం వరకు ఓకే కానీ.. వాటికి ఫ్యాన్స్ అసోసియేషన్లు అంటేనే వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది.
ఐతే ఊరికే జనాల దృష్టిని ఆకర్షించడానికే చేశారో ఏమో కానీ.. విజయవాడలో ఇలాంటి సంఘమే ఒకటి ఏర్పాటు చేసి, ఒక పోస్టర్ వదలడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ భారీ స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా ఈ సినిమా పెద్ద ఎత్తునే రిలీజైంది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు.
ఈ నేపథ్యంలో విజయవాడలో ఈ సినిమా ఆడుతున్న థియేటర్ దగ్గర ఒక ఆసక్తికర పోస్టర్ వెలసింది. కింగ్ కాంగ్ యూత్ ఫోర్స్, అఖిల భారత తెలుగు కింగ్ కాంగ్ యువత-విజయవాడ అంటూ పోస్టర్ మీద వేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు ఫ్లెక్సీల మీద రాసినట్లే దీని మీద కూడా వ్యాఖ్యానం ఉంది. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ చిత్రం విడుదల సందర్భంగా విచ్చేయుచున్న మా అభిమాన జంతువు కింగ్ కాంగ్ అభిమానులకు, థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాల్లో రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
వరల్డ్ వైడ్ కింగ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఛైర్మన్, కాంగ్ డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ కొందరి పేర్లు కూడా వేసుకున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొందరు టాలీవుడ్ జనాలు కూడా దీనిపై సరదాగా స్పందించారు. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా మంచి స్పందనే వస్తోంది.
This post was last modified on March 26, 2021 8:56 am
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…