Movie News

కమ్ములను చూసి నేర్చుకోండయ్యా


కాస్త పేరున్న సినిమా అంటే చాలు.. హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్ తీయాలన్నా, మంచి స్టెప్పులున్న పాట తీయాలన్నా కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. డ్యూయెట్ అంటే ఫారిన్ లొకేషన్లకు పరుగులు పెట్టేస్తారు. డ్యాన్సులన్న పాట అంటే కళ్లు జిగేల్‌మనేలా ఒక పెద్ద ఫ్లోర్‌ను అలంకరించి వెనుక పదుల సంఖ్యలో డ్యాన్సర్లను పెట్టి నానా హంగామా చేస్తారు. ఇలాంటి పాటలు బాగా మొహం మొత్తేసి, అసహజంగా అనిపించి పాట రాగానే ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికెళ్లిపోతుంటారు.

ఇలాంటి పాటల వల్ల సినిమాకు ఏమేరకు ప్రయోజనం అని చూడరు ఫిలిం మేకర్స్. పాట కోసం కొత్త ఆలోచనలేమీ చేయాల్సిన అవసరం లేకుండా.. కొరియోగ్రాఫర్లకు పని అప్పగించేస్తే వాళ్లు రొటీన్‌గా సాంగ్ లాగించి అవతల పడేస్తారు. దర్శకుల పని తేలికైపోతుంది. నిర్మాతలకు మాత్రం ఖర్చు తడిసి మోపెడవుతుంది. ప్రేక్షకులకైతే ఇలాంటి పాటల వల్ల ఏ రకమైన అనుభూతీ కలగదు.

కానీ కొందరు దర్శకులు మాత్రం పాట ద్వారా కూడా కథ చెప్పాలని చూస్తారు. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఇవ్వాలనుకుంటారు. తమ అభిరుచిని, భావుకతను చూపించడానికి పాటలను ఒక మంచి అవకాశంగా మలుచుకుంటారు. అలాంటి దర్శకుడే శేఖర్ కమ్ముల. ఇప్పటిదాకా ఆయన తీసిన ఏ సినిమాలోనూ మనం రెగ్యులర్‌గా చూసే ఫారిన్ లొకేషన్లలో డ్యూయెట్లు, డ్యాన్స్ ఫ్లోర్ల మీద అసహజమైన గెంతులు ఉండవు. పాట ద్వారా కూడా కథ చెప్పాలనుకుంటాడు. వాటిని అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాడు. చాలా తక్కువ ఖర్చుతో అతను పాటలను తీర్చిదిద్దే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘లవ్ స్టోరి’లో ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతి పాటలోనూ కమ్ముల ముద్ర కనిపించింది.

తాజాగా ఏవో ఏవో కలలే అంటూ ఒక పాటను వదిలారు ‘లవ్ స్టోరి’ నుంచి. ఈ లిరికల్ వీడియో చూసి మురిసిపోని ప్రేక్షకుడుండడు. కమ్ముల ఈ పాట కోసం భారీ లొకేషన్లు కోరుకోలేదు. ఒక మామూలు ఇంటి మేడ మీద వర్షం బ్యాక్ డ్రాప్‌లో పాట తీశాడు. లొకేషన్ ఎంత సాధారణంగా ఉన్నా, బ్యాగ్రౌండ్లో పదుల సంఖ్యలో డ్యాన్సర్లు లేకపోయినా.. ఈ పాట ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. హీరో హీరోయిన్ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ.. అదిరిపోయే స్టెప్పులతో ఈ పాట చూడగానే కట్టి పడేసింది. సినిమాలో ఈ పాట ఇంకెంత బాగుంటుందో.. ఎప్పుడెప్పుడు అది చూద్దామా అనే ఆసక్తిని రేకెత్తించింది. పాట అనగానే అవసరం లేని హంగామాతో కోట్లు వదిలించే దర్శకులు కమ్ములను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనడానికి ఈ పాట నిదర్శనం

This post was last modified on March 25, 2021 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి…

8 minutes ago

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

29 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

54 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago