Movie News

ఏనుగులన్నీ రానాపైకి దూసుకొచ్చిన వేళ..


ఒకప్పుడైతే అటవీ నేపథ్యంలో తరచుగా సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు కనీసం పల్లెటూళ్ల నేపథ్యంలో సినిమాలు తీయడం కూడా తగ్గిపోయింది. ఇక అడవుల సంగతేం చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఈ లోటు బాగా కనిపిస్తుంది. ఒకప్పుడు అడవి దొంగ, అడవి రాముడు, బొబ్బిలి రాజా.. ఇలా అడవి నేపథ్యంలో తెరకెక్కి బ్లాక్‌బస్టర్లు అయిన చాలా సినిమాలున్నాయి. గత రెండు దశాబ్దాల్లో మాత్రం ఈ తరహా సినిమాలు బాగా అరుదైపోయాయి.

ఇలాంటి తరుణంలో రానా దగ్గుబాటి పూర్తిగా అటవీ నేపథ్యంలో ఓ సినిమా చేశాడు. అదే.. అరణ్య. ఏనుగులు-ప్రకృతి-జీవ వైవిధ్యం.. ఈ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ చిత్రం కోసం రానా చాలానే కష్టపడ్డాడు. ‘బాహుబలి’కి మించి ఈ సినిమాకే ఎక్కువ శ్రమించానని రానా చెప్పాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. థాయ్‌లాండ్‌లోని అడవుల్లో పదుల సంఖ్యలో ఏనుగుల మధ్య ఈ సినిమా చిత్రీకరణ జరిపినట్లు అతను వెల్లడించాడు.

ఏనుగుల మధ్య షూటింగ్ చేయడం చాలా భయం వేసిందని, అసలు ఈ సినిమా కోసం సన్నద్ధం కావడమే చాలా కష్టమైందని రానా తెలిపాడు. శిక్షకుల ఆధ్వర్యంలో థాయ్‌లాండ్‌లో 15 రోజుల పాటు ఏనుగుల మధ్య గడిపి వాటిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించినట్లు రానా వెల్లడించాడు. తొలి నాలుగు రోజులు చాలా భయం వేసిందని.. తర్వాత వాటికి అలవాటు పడ్డానని రానా తెలిపాడు. తనకు ఏనుగులు అలవాటు పడ్డప్పటికీ.. అవి ఎప్పుడైనా అదుపు తప్పుతాయేమో అన్న భయం ఉండేదని, అందుకే జేబులో ఎప్పుడూ అరటిపండు, బెల్లం ముక్క పెట్టుకుని తిరుగుతుండేవాడినని రానా తెలిపాడు.

ఐతే ఒక రోజు తన జేబులో ఉన్న అరటిపండు కొంచెం బయటికి కనిపించిందని.. దీంతో తన దగ్గర చాలా అరటిపళ్లు ఉన్నాయేమో అనుకుని ఒక్కసారిగా ఏనుగులన్నీ తన వైపు దూసుకొచ్చాయని.. అప్పుడు వణికిపోయానని.. సమయానికి శిక్షకులు వచ్చి వాటిని అదుపు చేశారని రానా తెలిపాడు. ఎంతో కష్టపడి, మంచి ఉద్దేశంతో తీసిన ‘అరణ్య’ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని రానా ధీమా వ్యక్తం చేశాడు. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on March 24, 2021 1:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago