కరోనా విరామం తర్వాత తెలుగు సినిమాల జోరెలా ఉందో తెలిసిందే. థియేటర్ల పున:ప్రారంభంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఒకసారి థియేటర్లు మొదలై కొత్త సినిమాలు రావడం మొదలయ్యాక కలెక్షన్లకు ఢోకా లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సంక్రాంతి సినిమాలు వసూళ్ల పంట పండించుకున్నాయి. ఇక 100 శాతం ఆక్యుపెన్సీకి పెరిగాక పూర్తిగా మునుపటి జోరును అందుకున్నాయి థియేటర్లు. కంటెంట్ ఉన్న సినిమాలకు వసూళ్ల మోత మోగుతోంది. కానీ దేశంలో మిగతా ఇండస్ట్రీల్లో ఈ పరిస్థితి లేదు.
దక్షిణాదిన వేరే ఇండస్ట్రీల్లో అయినా కొంచెం పర్వాలేదు కానీ.. హిందీ సినిమా మార్కెట్ మాత్రం పుంజుకోవట్లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతుండటం, థియేటర్లపై ఆంక్షలు ఎత్తేయకపోవడం, జనాలు థియేటర్లకు రావడానికి అంతగా ఆసక్తి చూపించకపోవడంతో అక్కడ సినిమాలకు గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి.
లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ధైర్యం చేసి రిలీజ్ చేసిన ఏ సినిమా కూడా మంచి ఫలితాన్నందుకోలేదు. ఇందు కీ జవానీ, షకీలా, మేడమ్ ప్రైమ్ మినిస్టర్, రూహి లాంటి చిత్రాలకు దారుణమైన ఫలితాలు దక్కాయి. దీని బదులు ఈ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే కాస్త మెరుగైన రేటు దక్కేదని నిర్మాతలు చింతించే ఫలితాలు వచ్చాయి బాక్సాఫీస్ దగ్గర. ఈ అనుభవాల తర్వాత కూడా ఓ భారీ చిత్రాన్ని థియేటర్లలోకే దించారు. ఆ సినిమానే.. ముంబయి సెగా. ఈ సినిమాతో కథ మారుతుందని ఆశించారు. కానీ ఆ సినిమా కూడా కరోనా కాటుకు బలైపోయింది.
జాన్ అబ్రహాం యాక్షన్ సినిమాతో వస్తే తొలి రోజు దేశవ్యాప్తంగా పది కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ వస్తుంది మామూలుగా. అతడి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వసూళ్లు రూ.30 కోట్లకు అటు ఇటుగా ఉంటాయి. అలాంటిది ‘ముంబయి సెగా’కు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు రూ.10 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతుండటం, థియేటర్లపై ఆంక్షలు, జనాల అనాసక్తి వల్ల ఈ సినిమాకు వసూళ్లు మరీ తక్కువగా వచ్చాయి. కంటెంట్ పరంగా హిట్టవ్వాల్సిన సినిమా కాస్తా.. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కోణంలో చూస్తే డిజాస్టరే అయింది. ఈ సినిమా పరిస్థితి చూశాకే రానా సినిమా ‘అరణ్య’ హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’ రిలీజ్‌ను ఆపేసింది ఈరోస్ సంస్థ.
This post was last modified on March 24, 2021 1:41 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…