Movie News

ఆ హీరో ఖాతాలో 12వ ఫ్లాప్


ఆది సాయికుమార్.. పుష్కర కాలం నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న యువ కథానాయకుడు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఒక స్థాయి అందుకున్న సాయికుమార్ వారసత్వం ఉండటం వల్ల ఈ కుర్రాడికి అవకాశాలకైతే లోటు లేదు. కానీ సినిమాల ఎంపికలో చేస్తున్న పొరబాట్ల వల్ల ఆది కెరీర్ ఎంతకీ ఊపందుకోవట్లేదు. నిజంగా చెప్పాలంటే ఆది కెరీర్లో ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. సామాన్య జనాలైతే వాటిని హిట్లుగా పరిగణించరు.

ఐతే అవి ఆది కెరీర్‌కు పర్వాలేదనిపించే ఆరంభాన్నే ఇచ్చాయి. ఆ తర్వాత ఇంకాస్త పెద్ద విజయాలందుకుని హీరోగా నిలదొక్కుకుంటాడనుకుంటే.. అతడి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఇప్పటికీ ప్రేమకావాలి, లవ్లీ సినిమాల గురించి చెప్పుకుని తన కొత్త చిత్రాలను ప్రమోట్ చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు.

లవ్లీ తర్వాత ఆది వరుసగా 11 ఫ్లాపులు ఎదుర్కోవడం గమనార్హం. ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా ఒక హీరోకు అవకాశాలు వస్తున్నాయంటే విశేషమే. అది సాయికుమార్‌కు ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరు వల్లే. తాజాగా ఆది ‘శశి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకే ఒక లోకం నువ్వే పాట పుణ్యమా అని ఆది గత సినిమాలతో పోలిస్తే దీనికి ఓ మోస్తరుగా బజ్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాపై ఓ లుక్కేద్దామనుకున్నారు. కానీ సినిమా కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈ వారం వచ్చిన మిగతా రెండు సినిమాల కంటే ఏమాత్రం మెరుగ్గా ఉన్నా ‘శశి’ని ప్రేక్షకులు ఆదరించేవారేమో. కానీ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చూసిన వాళ్లందరూ ‘శశి’ గురించి పూర్తిగా నెగెటివ్‌గానే మాట్లాడుతున్నారు. రివ్యూలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో మినిమం ఆక్యుపెన్సీ లేకపోయింది ఈ చిత్రానికి. వరుసగా పన్నెండో ఫ్లాప్ ఆది ఖాతాలో పడిపోయింది. ఈ స్థితి నుంచి ఇక ఆది కోలుకోవడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.

This post was last modified on March 22, 2021 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో…

11 hours ago

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

'ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన…

12 hours ago

బాస్ ఈజ్ బాస్ : విశ్వక్ సేన్

వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…

12 hours ago

బ‌డ్జెట్ రెడీ.. ఆ రెండు ప‌థ‌కాల‌కే నిధులు ..!

ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను…

12 hours ago

తండేల్ పాసవ్వాల్సిన 4 పరీక్షలు

ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…

13 hours ago

లైలా… ఇంత స్పైసీ ఉంటే ఎలా

విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…

13 hours ago