‘బాహుబలి’ సినిమాతో ఇండియాలో ప్రభాస్ ఇమేజ్ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. ఇండియా మొత్తంలో మరే హీరోకూ సాధ్యం కాని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడతను. ఆ తర్వాత అతను నటించిన ‘సాహో’కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది దేశవ్యాప్తంగా. కానీ ‘సాహో’ అంచనాల్ని అందుకోలేకపోయింది.
ప్రభాస్ నుంచి రానున్న కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’కు ఎలాంటి ఫలితం వస్తుందో ఏమో కానీ.. ‘సాహో’ లాగా ఇది ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం పెంచలేకపోతోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న, చేయబోయే సినిమాలకు మంచి క్రేజ్ కనిపిస్తోంది కానీ.. ‘రాధేశ్యామ్’ మాత్రం అలా ప్రేక్షకులను ఆకర్షించలేకపోతోందన్నది వాస్తవం.
ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఎక్కువగా ఆశించేది మాస్, యాక్షన్ సినిమాలే.ఐతే అతను తన శైలికి భిన్నంగా ప్రేమకథ చేస్తున్నాడు. ఒకప్పుడు ‘డార్లింగ్’ టైపు లవ్ స్టోరీలు చేస్తే చెల్లింది కానీ.. ‘బాహుబలి’తో అతడి ఇమేజ్ శిఖర స్థాయికి చేరాక ప్యూర్ లవ్ స్టోరీలు అంటే కష్టమే. పైగా ప్రభాస్ ఇప్పుడున్న వయసులో, లుక్‌లో ప్రేమకథ అంటేనే ఎబ్బెట్టుగా ఉంటుంది. ‘రాధేశ్యామ్’కు మొదటి ప్రతికూలత ఇదే.
ఇక ‘జిల్’ లాంటి ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణకుమార్ ఈ చిత్రాన్ని రూపొందించడం వల్ల కూడా అంచనాలు తగ్గపోతున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ ప్రేక్షకులను రంజింపజేయలేకపోయాయి. ఈ మధ్యే రిలీజ్ చేసిన టీజర్ అయితే పూర్తిగా నిరాశపరిచింది.
‘రాధేశ్యామ్’ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా.. అది ట్రోల్‌కు గురవుతోంది తప్ప సినిమాపై ఆసక్తిని పెంచట్లేదు. ఈ మధ్యే ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే.. దాని మీద అదే పనిగా ట్రోలింగ్ నడుస్తోంది. అదొక మీమ్ మెటీరియల్ లాగా మారిపోయింది. సినిమా రిలీజ్ దగ్గర పడేసరికి ఆసక్తి పెరగాలి తప్ప, దానికి భిన్నంగా ఈ సినిమాకు అంతకంతకూ ఆసక్తి తగ్గిపోతుండటమే విడ్డూరం.
‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందనే నమ్మకాలు ట్రేడ్ వర్గాల్లోనూ లేనట్లే ఉన్నాయి. లేదంటే ‘గంగూబాయ్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ హిందీ సినిమాను దానికి పోటీగా సంజయ్ లీలా బన్సాలీ ఎందుకు నిలబెడతాడు? ఇప్పటిదాకా అయ్యిందేదో అయ్యింది.. ఇకనైనా ‘రాధేశ్యామ్’ను పైకి లేపడానికి చిత్ర బృందం ఏదో ఒకటి చేయాలి. ముఖ్యంగా ట్రైలర్ ఆకర్షణీయంగా లేకుంటే మాత్రం ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల పవనాలు తప్పవు.
This post was last modified on March 16, 2021 6:48 pm
శ్రీ వస్తవాయి సత్యనారాయణ వర్మ… మనమంతా షార్ట్ గా పిలుచుకునే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ చుట్టూ ఇప్పుడు వైసీపీలో…
ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలయ్యాక.. రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. పిలవకున్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. మేం రెడీ…
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఆదివారం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్…
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రెండు కీలక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి.…
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…