పుట్టిన రోజు నాడు చాలామంది కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి ఏదైనా మంచి అలవాటు మొదలుపెట్టాలని.. లేదంటే ఏదైనా చెడు అలవాటును విడిచిపెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఐతే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మాత్రం ఆశ్చర్యకరంగా సోషల్ మీడియాను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
సోషల్ మీడియా అనేది కొందరికి ఒక వ్యసనం. దానికి దూరంగా ఉండలేని బలహీనత ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాకు దూరమయ్యే వాళ్లూ ఉంటారు. కానీ ఆమిర్ అలా ఏమీ కాదు. ఆయన ట్విట్టర్లో కానీ, ఇతర సోషల్ మీడియాల్లో కానీ ఏమంత యాక్టివ్‌గా ఉండరు. తన సినిమాలు, ఇతర విషయాల గురించి ఎప్పుడో ఒక అప్‌డేట్ మాత్రమే ఇస్తుంటాడు. ఐతే సోమవారం ఆమిర్ పుట్టిన రోజు కాగా.. తనకు శుభాకాంక్షలు చెప్పిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పి సోషల్ మీడియాకు టాటా చెప్పేశాడు ఆమిర్.
తాను సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఏమీ ఉండననే విషయాన్ని కొంచెం వ్యంగ్యంగా చెప్పి.. తాను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించాడు. ఐతే అభిమానులు నిరాశ చెందకుండా తన సినిమాలకు సంబంధించి, ఇతర విషయాల గురించి అప్‌డేట్స్ ఇవ్వడానికి తన నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఉందని.. దాన్నుంచే ఇకపై తనకు సంబంధించి అధికారిక సమాచారాలు అందిస్తామని ఆమిర్ వెల్లడించాడు.
ఆమిర్ అలా అన్నప్పటికీ అతను సోషల్ మీడియాను వదిలి వెళ్లిపోవడం అభిమానులకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరీనా కపూర్ ఇందులో కథానాయిక. మన నాగచైతన్య ఇందులో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on March 15, 2021 6:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…