ఈ రోజు బాలీవుడ్ భామ ఆలియా భట్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోంచి ఆమె ఫస్ట్ లుక్ వదిలారు. ఈ చిత్రంలో ఆమె సీత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ముందు రోజే రాముడి విగ్రహం ముందు కూర్చుని ఉన్న సీతను వెనుక నుంచి చూపించి ఆలియా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. ఆ అంచనాలకు తగ్గట్లే ఉంది ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్.
బాలీవుడ్ సినిమాల్లో దాదాపుగా అన్నీ మోడర్న్ రోల్సే చేసిన ఆలియా.. ఇలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించేసరికి హిందీ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. హీరోనైనా, హీరోయిన్‌నైనా తన సినిమాలో అత్యంత ఆకర్షణీయంగా చూపిస్తాడని రాజమౌళికి పేరుంది. ఆ పేరుకు తగ్గట్లే ఆలియాను కూడా బెస్ట్ లుక్‌లో చూపించాడు జక్కన్న. ఈ చిత్రం శతాబ్దం ముందు కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆలియా లుక్ అలా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఐతే సీతగా ఆలియా ఫస్ట్ లుక్ చూసి ఆ పాత్ర.. దాంతో ముడి పడ్డ సన్నివేశాల గురించి అప్పుడే జనాలు కొన్ని కథలు అల్లేస్తున్నారు. ఈ పోస్టర్లో అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నది ఆలియా మెడలోని లాకెట్టే. అది మగాళ్లు వేసుకునే లాకెట్. అది రామరాజుదే అయ్యుంటుందనడంలో సందేహం లేదు. రామరాజు కోసం ఎదురు చూస్తున్న సీత అంటూ ఈ పాత్ర గురించి జక్కన్న కొంత హింట్ ఇచ్చాడు.
ఒక మామూలు యువకుడిగా ఉన్న సీతారామరాజు.. కొన్నేళ్ల పాటు ఉత్తరాది ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక యోధుడిగా మారి తిరిగి స్వస్థలానికి వచ్చి బ్రిటిష్ వారితో పోరాడేలా ఈ కథ నడుస్తుందని రాజమౌళి ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ కథకు ముందు రామరాజు-సీతల మధ్య ప్రణయగాథను చూపించి.. ఆ తర్వాత రామరాజులో ఒక పరివర్తన వచ్చి ఉత్తరాదికి బయల్దేరుతూ ‘నేను తిరిగొచ్చే వరకు ఈ లాకెట్‌లోనే నన్ను చూసుకో’ అంటూ సీతకు చెప్పి వెళ్తాడని.. అప్పట్నుంచి రామరాజు కోసం సీత వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటుందంటూ ఈ పాత్రకు సంబంధించిన కథను అల్లేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on March 15, 2021 1:34 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…