Movie News

మ‌రో దేవ‌ర‌కొండ అవుతాడా?

తెలుగులో గ‌త రెండు ద‌శాబ్దాల్లో హీరోగా అనూహ్య‌మైన ఎదుగుద‌ల అంటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌దే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం లాంటి సినిమాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన అత‌ను.. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా అత‌డి ఇమేజ్ మారిపోయింది. పెద్ద స్టార్ అయిపోయాడు.

విజ‌య్ లుక్స్, అత‌డి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ టాలెంట్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ త‌రానికి అచ్చ‌మైన ప్ర‌తినిధిలా క‌నిపిస్తాడు విజ‌య్. బ‌య‌ట అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌, మాట‌తీరు కూడా చాలా విల‌క్ష‌ణంగా ఉంటుంది. యూత్‌లో ఫాలోయింగ్ పెర‌గ‌డానికి అది కూడా ఒక కార‌ణం. ఇప్పుడు విజ‌య్ త‌ర‌హాలోనే మ‌రో యంగ్ హీరో చాలా త‌క్కువ వ్య‌వ‌ధిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అత‌నే న‌వీన్ పొలిశెట్టి.

న‌వీన్ ఇండ‌స్ట్రీకి కొత్తేమీ కాదు. ఆరేడేళ్ల ముందు నుంచే సినిమాలు చేస్తున్నాడు. 1 నేనొక్క‌డినే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాల్లో అత‌ను న‌టించాడు. హిందీలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ బ్రేక్ రావ‌డానికి చాలా టైం ప‌ట్టేసింది. రెండేళ్ల కింద‌ట ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ యువ న‌టుడి ప్ర‌తిభ ఏంటో అంద‌రికీ తెలిసేలా చేసింది. ఆ స‌ర్ప్రైజ్ హిట్‌తో న‌వీన్ పేరు మార్మోగింది.

ఇప్పుడు జాతిర‌త్నాలు సినిమాతో న‌వీన్ క్యాలిబ‌ర్ ఏంట‌న్న‌ది మ‌రింత‌గా జ‌నాల‌కు తెలిసిందే. ఈ సినిమాలో అత‌ను చేసిన శ్రీకాంత్ పాత్ర గురించి.. అందులో అత‌డి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ సినిమాతో అత‌డికి వ‌చ్చిన క్రేజ్ కూడా అసామాన్య‌మైన‌ది. ఒక్క‌సారిగా కోట్ల‌మందికి అత‌ను ఇష్టుడిగా మారిపోయాడు. న‌వీన్ రియ‌ల్ టాలెంట్ ఇంత కాలానికి జ‌నాల‌కు తెలిసింద‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చించుకుంటున్నారు. అత‌డిపై పేరున్న ద‌ర్శ‌కులు క‌ళ్లు ప‌డ్డ‌ట్లే ఉన్నాయి. మున్ముందు అత‌డికి పెద్ద అవకాశాలే వ‌చ్చేలా ఉన్నాయి. చూస్తుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర‌హాలోనే అత‌ను పెద్ద రేంజికి వెళ్లేలా క‌నిపిస్తున్నాడు.

This post was last modified on March 14, 2021 10:11 am

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

12 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago