మహాశివరాత్రికి కొత్త సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించినపుడు బాక్సాఫీస్ లీడర్ అవుతుందని అందరూ అంచనా వేసింది శ్రీకారం సినిమానే. ఈ సినిమాకే ప్రి రిలీజ్ బజ్ ఎక్కువగా ఉంటుందని.. అడ్వాన్స్ బుకింగ్స్.. ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయని అనుకున్నారు. కానీ రిలీజ్ ముంగిట, ఆ తర్వాత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జాతిరత్నాలు దెబ్బకు శ్రీకారం సినిమానే నిలిచే పరిస్థితి కనిపించడం లేదు.
మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. శ్రీకారం సినిమాకు వీకెండ్లో ఆశించిన వసూళ్లు లేవు. జాతిరత్నాలు హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. అదనంగా షోలు వేసినా ఫుల్ అయ్యే పరిస్థితి ఉంది. అదే సమయంలో శ్రీకారం చిత్రానికి ఫుల్స్ లేవు. ఓ మోస్తరు ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఈ చిత్రానికి థియేటర్లు పెద్ద సంఖ్యలోనే ఇచ్చినా.. ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. శ్రీకారం పరిస్థితి అయినా పర్వాలేదు కానీ.. ఈ వారం వచ్చిన మరో సినిమా గాలి సంపత్ పరిస్థితి దయనీయం.
ఈ వారం మూడు సినిమాల్లో ముందు నుంచి ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించనిది గాలి సంపత్ సినిమానే. ఐతే సినిమా మీద భరోసాతో పోటీకి నిలిపారు మేకర్స్. ఐతే ఈ చిత్రానికి ఏమాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. జాతిరత్నాలు, శ్రీకారం రూపంలో మంచి ఆప్షన్లు ఉండగా.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రానికి జనాలు ఎందుకు వెళ్తారు? దీంతో వీకెండ్లోనే ఈ సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు వాషౌట్ అన్న సంగతి తొలి రోజే నిర్ణయమైపోయింది. శనివారం పరిస్థితి చూశాక ఆ విషయం ఖరారైపోయింది.
ఇక గత వారం వచ్చిన ఎ1 ఎక్స్‌ప్రెస్‌కు కూడా జాతిరత్నాలు మంగళం పాడేసింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి వారాంతంలో ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. వీకెండ్ అయ్యాక వసూళ్లు తగ్గాయి. గురువారం కొత్త సినిమాల రాకతో ఎ1 ఎక్స్‌ప్రెస్ వైపు జనాలు చూడ్డం మానేశారు. ముఖ్యంగా జాతిరత్నాలు దెబ్బకు ఈ సినిమా కథ సమాప్తం అయినట్లయింది.
This post was last modified on March 14, 2021 10:06 am
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…