‘జాతిరత్నాలు’ సినిమా సెట్స్ మీద ఉన్నపుడు ఇదేదో చిన్న సైజు సినిమా అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచనాలకు పెద్ద సినిమాల రికార్డులూ బద్దలైపోతున్నాయి. ముఖ్యంగా ఏడాదిగా స్తబ్దుగా ఉన్న యుఎస్ మార్కెట్లో ఈ సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ తర్వాత యుఎస్‌లో రిలీజైన అన్ని సినిమాల్లోకి అత్యధిక ప్రిమియర్ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ‘జాతిరత్నాలు’ రికార్డు నెలకొల్పడం విశేషం.
ఈ చిత్రానికి బుధవారం ప్రిమియర్స్‌లో ఏకంగా 1.33 లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి. కరోనా బ్రేక్ తర్వాత ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ప్రిమియర్స్ నుంచి లక్షల డాలర్లు రాబట్టలేదు. ఇప్పటిదాకా తమిళ చిత్రం ‘మాస్టర్’దే అత్యధిక ప్రిమియర్స్ వసూళ్ల రికార్డు. ఆ చిత్రం 93 వేల డాలర్లు వసూలు చేసింది. దాన్ని అలవోకగా కొట్టేయడమే కాదు.. లక్ష డాలర్ల మార్కును కూడా అధిగమించింది ‘జాతిరత్నాలు’.
లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలు మాత్రమే యుఎస్‌లో ప్రభావం చూపాయి. ‘ఉప్పెన’ ఫుల్ రన్లో దాదా 2 లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. దాన్ని ప్రిమియర్స్ + డే 1 వసూళ్లతోనే దాటేయబోతోంది ‘జాతిరత్నాలు’. లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రం కూడా ఆ ఘనతను అందుకోలేకపోయింది.
దేశీయ మార్కెట్ పుంజుకున్నా యుఎస్ మార్కెట్ డల్లుగా ఉండటంతో నిర్మాతలు నిరాశలో ఉన్నారు. ఒకప్పుడు బంగారు బాతులా కనిపించిన ఈ టెరిటరీ ఇలా తయారైందేమిటి అని బాధ పడుతున్నారు. ఇలాంటి టైంలో ‘జాతిరత్నాలు’ వేసవికి రాబోయే భారీ చిత్రాల్లో ఆశలు పెంచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ‘జాతిరత్నాలు’ దూకుడు మామూలుగా లేదు. ఈ రోజే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును దాటి రేపట్నుంచి లాభాలు అందించేలా కనిపిస్తోంది.
This post was last modified on March 13, 2021 1:54 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…