హిందీలో గత కొన్నేళ్లలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ‘అంధాదున్’ ఒకటి. ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ ఒక వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో జీవనోపాధి కోసం హీరో అంధుడిగా నటిస్తూ ఉంటాడు. అతను తన కళ్ల ముందు జరిగిన ఓ హత్యను చూస్తే ఏంటి పరిస్థితి అనే కథాంశంతో ఆద్యంతో ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం.
ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో యూత్ స్టార్ నితిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. అతడి సరసన నభా నటేష్ నటిస్తోంది. ఒరిజినల్లో టబు చేసిన అత్యంత కీలక పాత్రలో తమన్నా నటిస్తోంది. మేర్లపాక గాంధీ తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాకు రీమేక్ చాన్నాళ్ల ముందే కన్ఫమ్ అయింది. ఆ చిత్రం తాజాగా సెట్స్ మీదికి వెళ్లింది.
కానీ తమిళ ‘అంధాదున్’ విషయంలో అక్కడి ప్రేక్షకుల్లో ఏమాత్రం ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. అందుక్కారణం కాస్ట్ అండ్ క్రూనే. 50వ పడికి చేరువ అవుతున్న సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో కథానాయకుడు అనగానే సగం ఆసక్తి చచ్చిపోయింది. ఇక టబు పాత్రకు సిమ్రాన్‌ను ఎంచుకోవడమూ చాలామందికి నచ్చలేదు. సిమ్రాన్ ఈ మధ్య పూర్తిగా గ్లో కోల్పోయింది. ఆమెలో ఆకర్షణ అంతా పోయింది. ఇక ఈ సినిమాకు ముందు జేజే ఫ్రెడరిక్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు.
కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో అతణ్ని తప్పించేశారు. ప్రారంభోత్సవం రోజు.. తాను ఈ సినిమాలో భాగం కాదంటూ అతను ప్రకటించాడు. ప్రశాంత్ తండ్రి.. ఒకప్పటి విలన్ అయిన త్యాగరాజన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట. కొడుకు హీరోగా ఆయన కొన్ని సినిమాలు తీశాడు కానీ.. అవేవీ అంతగా ఆడలేదు. ఆయన్ని ఔట్ డేటెడ్ డైరెక్టర్ అంటుంటారు. అలాంటి వ్యక్తి ‘అంధాదున్’ లాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌ను ఏం డీల్ చేస్తాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా పట్ల తమిళ ప్రేక్షకులు ముందే పెదవి విరిచేస్తున్నారు.
This post was last modified on March 10, 2021 6:22 pm
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…