అక్కినేని నాగచైతన్య కొత్తగా ‘థ్యాంక్ యు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఏ సందర్భం లేకపోయినా.. ఈ సినిమా పేరు ఇప్పుడు ఉన్నట్లుండి ట్విట్టర్లో ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడేమీ అప్‌డేట్ లేదు. దాని ఫస్ట్ లుక్, టీజర్ లాంటివి రాబోతున్నట్లు సంకేతాలు కూడా రాలేదు. అసలు ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తున్నది అక్కినేని అభిమానులు కూడా కాదు. ఆ పని చేస్తున్నది, ‘థ్యాంక్’ సినిమాను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం. ఎందుకిలా అనిపిస్తోందా..? ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
‘థ్యాంక్ యు’ సినిమాలో చైతూ మహేష్ బాబుకు వీరాభిమానిగా నటిస్తున్నాడు. టీనేజీలో ఉన్నపుడు మహేష్ అంటే పడి చచ్చేలా ఉంటుందట అతడి క్యారెక్టర్. ఇప్పటికే చైతూ మీసం గడ్డం తీసేసి, చిన్న కుర్రాడిలా మారిన లుక్ ఒకటి ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లుక్‌తోనే తాజాగా షూట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆ సన్నివేశం ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లబోతోంది. మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ టైంలో మహేష్ అభిమానిగా చైతూ చేసిన సందడిని ఈ సినిమాలో చూపిస్తున్నారు.
ఒక థియేటర్ ముందు మహేష్ బాబు భారీ కటౌట్ పెట్టి.. దాన్ని చైతూనే ఆవిష్కరించే సన్నివేశం తీసింది ‘థ్యాంక్ యు’ టీం ఈ మధ్యే. చైతూ కటౌట్ పైకి నిచ్చెన ద్వారా వెళ్లడం.. పైన తెరను తీసి మహేష్ కటౌట్‌ను ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం.. వీడియోలో కనిపిస్తోంది. సంబంధిత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇవి చూసి మహేష్ అభిమానులు నోస్టాల్జిక్ ఫీలింగ్‌లోకి వెళ్లిపోతున్నారు. ‘ఒక్కడు’ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ‘థ్యాంక్ యు’లో మహేష్ రెఫరెన్స్ పట్ల చాలా ఖుషీగా ఉన్న సూపర్ స్టార్ అభిమానులు.. ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తూ, రిలీజ్ టైంలో తమ సపోర్ట్ ఫుల్‌గా చైతూకు ఇస్తామని హామీ ఇస్తుండటం విశేషం.
This post was last modified on March 9, 2021 8:24 am
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…