జాతి రత్నాలు.. కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకుల చర్చల్లో ఎక్కడ చూసినా ఈ సినిమానే ఉంటోంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎప్పుడో ఏడాది కిందట మొదలైంది. కానీ సినిమా పూర్తి కావడంలో కొంత ఆలస్యం జరగ్గా.. కరోనా విరామం సినిమా మరింత లేటయ్యేలా చేసింది. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక తొందరపడకుండా వెయిట్ చేసి, ఇప్పుడు మహాశివరాత్రి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. కాస్ట్ అండ్ క్రూ ప్రకారం చూస్తే ఇది చిన్న సినిమానే. కానీ దీనికి బిజినెస్ మాత్రం పెద్ద స్థాయిలోనే జరిగింది.
‘జాతిరత్నాలు’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.11 కోట్లు పలికాయట. ఈ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద మొత్తమే. సినిమా మొదలైనపుడు ఐదారు కోట్ల బిజినెస్ చేస్తే ఎక్కువ అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాకు మంచి క్రేజ్ రావడంతో దానికి రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
‘జాతిరత్నాలు’ ప్రోమోలు మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోందీ చిత్రం. టీజర్, ట్రైలర్ రెండూ కూడా చాలా ఫన్నీగా ఉండి సినిమాపై అంచనాలు పెంచాయి. రిలీజ్ ముంగిట ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో అతడి బ్రాండ్ డా సినిమాకు ప్లస్ అయింది.
‘జాతిరత్నాలు’ స్యూర్ షాట్ హిట్ అనే టాక్ ఇండస్ట్రీలోకి ఆల్రెడీ వెళ్లిపోయింది. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి చాలా బాగుందంటూ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు అనూహ్యమైన స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి కానుకగా.. మార్చి 11న ‘శ్రీకారం’; ‘గాలి సంపత్’ చిత్రాలకు పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
This post was last modified on March 7, 2021 2:35 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…